జగన్ కంటే.. రవి ప్రకాష్ చేసింది తీవ్రమైన నేరమా : రుజువైతే జీవిత ఖైదు శిక్ష పడుతుందా?

May 10, 2019


టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ వ్యవహారం తెలుగులోనే కాదు జాతీయ మీడియాలో సైతం కలకలం రేపుతోంది. అతనిపై బుక్ అయిన కేసులు తీవ్రత ఇప్పుడిప్పుడే చర్చనీయాంశం అవుతుంది. తీవ్రమైన ఆర్థిక, మోసపూరిత, కుట్ర చేసినట్లు పలు సెక్షన్ల కింద FIR నమోదు కావటం విశేషం. జగన్ కంటే పెద్ద నేరం చేశాడా రవి ప్రకాష్ అని ఇప్పుడు అందరూ చర్చించుకోవటం జరుగుతుంది. జగన్ పై నమోదైంది ఆర్థిక వ్యవహారాలు, క్విడ్ ప్రో కేసులు. కానీ రవి ప్రకాష్ పై మాత్రం మోసపూరితం, నమ్మకద్రోహం, చీటింగ్, నిధుల మళ్లింపు లాంటి తీవ్రమైన కేసులు నమోదు కావటం చూస్తుంటే ఆయనకు కనీసం 6 నెలల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సెక్షన్లు చెబుతున్నాయి. ఇదే విషయం ఇప్పుడు అందరిలో చర్చనీయాంశం అయ్యింది.
జగన్ పై నమోదైన సెక్షన్ల కంటే.. రవి ప్రకాష్ పై నమోదైన కేసులే తీవ్రంగా ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.
– ఐపీసీ సెక్షన్ 120బి కింద నేరం రుజువైతే కనీసం ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే జీవిత ఖైదు వరకూ శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు.
– ఐటీ యాక్ట్ 66 కింద నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందంటున్నారు.
– ఐటీ యాక్ట్ 72 కింద నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా లక్ష జరిమానా
– ఐటీ యాక్ట్ 66సీ కింద నేరం రుజువైతే మూడేళ్ల జైలు, లక్ష జరిమానా. రెండూ విధించే అవకాశం
– ఐటీ యాక్ట్ 66డి కింద మూడేళ్ల వరకు జైలు, లక్ష జరిమానా. లేదా రెండూ
– ఐపీసీ 420 కింద ఏడేళ్ల వరకు జైలు, జరిమానా
– ఐపీసీ 406 కింద మూడేళ్ల వరకు జైలు, జరిమానా
– ఐపీసీ 467 కింద ఫోర్జరీ నిజం అని తేలితే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం
– ఐపీసీ 469 కింద నేరం రుజువైతే మూడేళ్ల జైలు, జరిమానా
– ఐపీసీ 471 కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం
ఈ సెక్షన్ల కింద రవి ప్రకాష్ పై కేసులు నమోదు అయ్యాయి. విచారణ తర్వాత అనుమానాలు ఉంటే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు న్యాయ నిపుణులు. కోర్టులో నేరం రుజువైతే మాత్రం శిక్ష, జరిమానాలు కూడా భారీగానే ఉంటాయని అంటున్నారు. నమోదు అయిన సెక్షన్లు – వాటి కింద శిక్షలు ఇలా ఉన్నాయి అని మాత్రం చెప్పటం మా ఉద్దేశం. రవి ప్రకాష్ నేరం చేశాడా లేదా అనే అంశం జోలికి తుగ్లక్ టైం వెళ్లటం లేదు. నమోదు చేసిన సెక్షన్లలోని తీవ్రత చూస్తుంటే ఇది చాలా పెద్ద నేరంగా సామాన్యులు భావిస్తున్నారు. నిజం పెరుమాళ్లకే ఎరుక..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.