బాలుడి క‌ష్టానికి క‌న్నీళ్లు పెట్టిన ప్ర‌భాస్.. గుండెల‌కు హ‌త్తుకుని ఓదార్పు

August 13, 2018

ఏడేళ్ల బాలుడు.. పేరు మ‌ద‌న్. ఆడుతూపాడుతూ తిరిగే వ‌య‌స్సు.. జ‌బ్బు చేసింది. చూస్తే అందిర‌లానే ఉంటాడు మ‌ద‌న్.. కాక‌పోతే రోజురోజుకు బ‌భ‌ళిస్తు..మ‌రెన్నో రోజులు నీకు భూమిపై బ‌తికే ఛాన్స్ లేద‌ని చెబుతోంది ఆ వ్యాధి. ఆ త‌ల్లిదండ్రులు కూడా ఎంతో కుమిలిపోయారు. చిన్నారి కోరికలు తీర్చటానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే బాలుడు మ‌ద‌న్.. త‌న‌కు ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి ప్ర‌భాస్ సినిమాలు చూస్తూ ఉండేవాడు. ప్ర‌భాస్ అంటే పిచ్చి అభిమాని. బాహుబ‌లి సినిమాల‌ను చూస్తూనే ఉండేవాడు. మమ్మీ, డాడీ నాకు ప్ర‌భాస్ అంకుల్ ను క‌ల‌వాల‌ని ఉంది.. ఒక్క‌సారి తీసుకెళ్ల‌రా అని చాలా సార్లు అడిగాడు. ఆ త‌ల్లిదండ్రుల‌కు జూబ్లీహిల్స్ ఉండే రెబ‌ల్ స్టార్ ను క‌ల‌వ‌టం అనేది అసాధ్యం. అయినా కుమారుడి కోరిక తీర్చాల‌ని ఆశ‌ప‌డ్డారు. వెంట‌నే బాలుడితో క‌లిసి సోష‌ల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ పెట్టారు.
ఐ వాంట్ టు మీట్ ప్ర‌భాస్ అంటూ ఆ చిన్నారి ఆస్ప‌త్రి బెడ్ పైనుంచే ఓ ప్లేకార్డు ప‌ట్టుకుని తీసిన ఫొటోతో త‌మ ఫేస్ బుక్ ద్వారా కోరారు. ఈ పోస్ట్ చూసిన యంగ్ రెబ‌ల్ స్టార్ అభిమానులు వైర‌ల్ చేశారు. హీరో ప్ర‌భాస్ ద్రుష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్ర‌భాస్.. బాలుడి అనారోగ్యం, వారి త‌ల్లిదండ్రుల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. వెంట‌నే ఆఫీస్ కు రావాల‌ని.. న‌న్ను క‌ల‌వాల‌ని స‌మాచారం ఇచ్చాడు.
ఊహించ‌ని ఈ పిలుపుతో బాలుడు ఎగిరి గంతులేశాడు. హీరో ప్ర‌భాస్ స్వ‌యంగా పంపించిన కారులోనే ఆస్ప‌త్రి నుంచి ఆఫీస్ కు వ‌చ్చాడు. 30 నిమిషాలు బాలుడితో గ‌డిపాడు. ముద్దాడాడు. ఓ సంద‌ర్భంగా ఆ త‌ల్లిదండ్రులు చెబుతున్న అనారోగ్యం వివ‌రాలు వింటూ.. క‌న్నీళ్ల ప‌ర్యంతం అయ్యాడు ప్ర‌భాస్. అయితే ఆ వెంట‌నే త‌న క‌న్నీళ్ల‌ను క‌వ‌ర్ చేసుకోవ‌టానికి న‌ల్ల‌క‌ళ్ల‌ద్దాలు కూడా పెట్టాడు. తాను యూర‌ప్ టూర్ కు వెళ్లిన‌ప్పుడు తెచ్చుకున్న మ‌రో క‌ళ్ల‌ద్దాల‌ను బాలుడికి గిఫ్ట్ గా ఇచ్చాడు. హీరో, బుల్లి అభిమాని క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని ఫొటోలు దిగారు. ఆ ఫ్యామిలీకి ట్రీట్ ఇచ్చిన ప్ర‌భాస్.. చికిత్స కోసం అవుతున్న ఖ‌ర్చుకు ఆర్థిక‌సాయం చేస్తాన‌ని.. ఎప్పుడు అవ‌స‌రం వ‌చ్చినా నేరుగా ఇంటికి రావొచ్చ‌ని ఓ ఫోన్ నెంబ‌ర్ కూడా ఇచ్చారు.
ప్ర‌భాస్ ఆత్మీయ స్వాగ‌తం, అందించిన ఆద‌ర‌ణ‌కు ఆ కుటుంబం మొత్తం క‌న్నీళ్ల‌ప‌ర్యంతం అయ్యింది. బాహుబ‌లి ఇచ్చిన దైర్యంతో అయినా మా మా అబ్బాయి మామూలుగా అవుతాడ‌ని కొండంత ఆశ‌తో.. ప్ర‌భాస్ ఇంటి నుంచి వెనుదిరిగింది ఆ కుటుంబం. సినిమాల్లోనే కాదు.. రియ‌ల్ గానూ బాహుబ‌లే అని మ‌రోసారి నిరూపించాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.