ఆ రాజశేఖర్ పెట్టింది.. నేను టేకోవర్ చేయటమా : ఐన్యూస్ పై రవిప్రకాష్ వర్గం అసహనం

May 15, 2019

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వటం అంటే ఇదేనేమో.. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అనటానికి తెలుగు మీడియాలో ఇదో చక్కటి ఎగ్జాంపుల్. టీవీ9 నుంచి అవినీతి ఆరోపణలతో బయటకు వచ్చేసిన రాజశేఖర్.. ఆ తర్వాత టీవీ9పై కసి, కోపంతో ఐన్యూస్ పెట్టారు. అప్పట్లో టీవీ9కే పోటీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సహజంగానే రాజశేఖర్ లో ఉండే భయం, అభద్రతాభావం, స్వార్థం వల్ల ఐన్యూస్ నుంచి బయటకు వచ్చి ఉద్యోగస్తుడిగా NTVలో సెటిల్ అయిపోయారు.
కాల మహిమ ఏంటో కానీ.. అప్పటి రాజశేఖర్ సైలెంట్ గా బయటకు వస్తే.. రచ్చ చేసుకుని రవిప్రకాశ్ ఇప్పుడు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆ న్యూస్ ఛానల్.. ఈ న్యూస్ ఛానల్ లోకి వెళుతున్నారు అంటూ పెద్ద ఎత్తున రచ్చ మొదలైంది. ఐన్యూస్ లోకి రవి ప్రకాష్ అనేది వైరల్ కావటంతో.. అతని వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. రాజశేఖర్ పెట్టిన ఐన్యూస్ లోకి ఇప్పుడు రవి ప్రకాష్ ఎలా వెళతాడు అని అనుకుంటున్నారు అంటూ అసహనం వ్యక్తం చేస్తోంది. ఛానల్స్, సోషల్ మీడియాకు కొదవ లేదు.. అలాంటప్పుడు ఐన్యూస్ లోకి ఎందుకు వెళతాడు.. ఎందుకు తీసుకుంటారు అనే పాయింట్ రైజ్ అయ్యింది. పదేళ్లుగా ఐన్యూస్ పడుతూనే ఉంది. ఆఫీస్ మారి.. సాధారణ లుక్ కు వచ్చింది. అందులో ఏముందని.. ఏ రేటింగ్ లో ఉందని ఐన్యూస్ టేకప్ చేస్తాం అంటూ రవి ప్రకాష్ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది.
కావాలనే కొందరు కుట్ర చేస్తూ ఐ న్యూస్ పేరుతో ముడిపెట్టి వార్తలు రాస్తున్నారని.. ప్రస్తుతం సోషల్ మీడియా, ఇతర టీవీ ఛానల్స్ లో వస్తున్నంత గంభీరంగా పరిస్థితులు ఏమీ లేవని.. అన్ని త్వరలోనే సర్దుకుంటాయని చెబుతున్నారు. ఐ న్యూస్ ఛానల్ లోకి రవి ప్రకాష్ అనే వార్త వెనక.. రాజశేఖర్ హస్తం కూడా ఉండొచ్చని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. అవకాశం వచ్చింది కదా అని ఇప్పుడు ఇలాంటి లీకులు, వార్తలు రాయిస్తున్నాడనే అనుమానాలు కూడా రవి ప్రకాష్ వర్గం వ్యక్తం చేయటం విశేషం.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.