ఏపీకి రవి ప్రకాష్ జంప్? – ఆదరిస్తున్నది అతనేనా?

May 10, 2019


టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఎక్కడున్నారు.. ఇంత జరుగుతున్నా ఎందుకు బయటకు రావటం లేదు.. తనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయినా.. నోటీసులు జారీ అయినా ఎందుకు అజ్ణాతంలో ఉన్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన ఫోర్జరీ కేసులు నమోదు అయ్యాయి అని తెలిసిన వెంటనే.. ఆయన ఏపీకి జంప్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఓ కీలక యువనేత రక్షణలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం పరిస్థితులు హాట్ గా ఉన్నందున.. సాక్షి, 10టీవీ, Ntv న్యూస్ ఛానల్స్ లో పెద్దఎత్తున కథనాలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో బయటకు వస్తే మరింత రచ్చ అవుతుందని.. కొన్ని రోజులు వెయిట్ చేస్తే.. అప్పటి వరకు సురక్షితమైన ప్రాంతంలో ఉంటే సేఫ్ అనుకుని ఏపీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఏపీలోకి వెళ్లిన రవి ప్రకాష్, శివాజీలు.. తమకు ఎంతో ఆప్తుడు, మిత్రుడు అయిన కీలక యువనేత సంరక్షణలో సేఫ్ గా, హ్యాపీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో కేసు నమోదు అయిన తర్వాత ఏపీకి జంప్ అయిన వ్యక్తుల్లో రవిప్రకాష్, శివాజీ రెండో వారు. గతంలో ఐటీ గ్రిడ్ కేసులోనూ ఆ సంస్థ యజమాని, ప్రధాన నిందితుడు అశోక్ కూడా ఇలాగే ఏపీకి వెళ్లిపోయారు. ఆయనకు కూడా ఆ యువనేతే ఆశ్రయం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రవి ప్రకాష్ కూడా ఇదే బాటలో ఏపీకి వెళ్లారని చెప్పుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా రవిప్రకాష్ మాట వినటం లేదని.. ఆయన్ను సపోర్ట్ చేయటం లేదని సుస్పష్టం. మరి అలాంటప్పుడు ఓ ప్రభుత్వం నుంచి రక్షణ పొందాలి అంటే మరో ప్రభుత్వమే వల్లే సాధ్యం అవుతుంది. దీన్ని పసిగట్టిన ఐటీ గ్రిడ్ అశోక్ కానీ.. ఇప్పుడు రవిప్రకాష్, శివాజీ కానీ అదే బాటలో ఏపీకి వెళ్లిపోయినట్లు చెప్పుకుంటున్నారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.