రవి ప్రకాష్ కు సాయం చేయొద్దు : ఏపీ కీలకనేతలకు ఆ మీడియా ప్రతినిధుల హెచ్చరికలు

May 10, 2019


టీవీ9 నుంచి సీఈవోగా రవి ప్రకాష్ తొలగింపు తర్వాత ఇది టీవీ ఛానల్ లో సంక్షోభం కంటే.. రవిప్రకాష్ అడుగులపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. రవి ప్రకాష్ ఏపీకి వెళ్లాడని, కీలకమైన నేత ద్వారా లాబీయింగ్ చేస్తున్నాడని వస్తున్న వార్తలతో ఓ రెండు మీడియా ఛానల్స్ ప్రతినిధులు అలర్ట్ అయ్యారంట. కలర్ ఛానల్స్ గా గుర్తింపు పొందిన వీరు.. కొందరికి కమ్మగా సపోర్ట్ చేయటం కూడా తెలిసిందే. టీవీ9 సీఈవోగా రవి ప్రకాష్ తొలగింపు తర్వాత.. ఆయన ఎక్కడ ఆయనకు, ఆయన కుమారుడు అయిన యువనేతకు దగ్గర అవుతాడో అనే భయం పట్టుకుంది అంట వాళ్లకు. దీంతో ఇప్పటికే ఈ కలర్స్ ప్రతినిధులు కొందరు.. ఏపీలోని కీలకమైన నేతలకు సమాచారం ఇచ్చారంట.
ఆయన వస్తే మాత్రం సపోర్ట్ చేయొద్దు.. ఆయన మాటల్లో పడితే మీరు ఏదో ఒక రోజు ఇలాగే ఇబ్బంది పడతారు.. మాకు ఉన్న అత్యంత బలమైన పత్రికా నెట్ వర్క్ ద్వారా కూడా మీకు సపోర్ట్ చేయం అన్నంతంగా హెచ్చరికలు చేసినట్లు గట్టిగా ప్రచారం జరుగుతుంది. రవి ప్రకాష్ పై ఎందుకంత కక్ష కట్టారు.. ఎందుకంత కోపం అనేది మాత్రం చర్చనీయాంశం అయ్యింది.
రవి ప్రకాష్ చేతిలో ఛానల్ లేకపోయినా.. ఐ ఫ్రేమ్ అనే సొంత మీడియా సంస్థ నడుస్తోంది. వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ ఇందులో నుంచి నడుస్తాయి. ఇన్నాళ్లు ఈ సంస్థలకు కూడా టీవీ9 నుంచే నిధులు వెళ్లాయని.. ఇప్పుడు సొంత నిధులు పెట్టాలంటే కష్టం అనే చర్చ అప్పుడే మొదలైంది. చేతిలో టీవీ9 లేకపోతే వెనక నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి. సోషల్ మీడియాను నమ్ముకుంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే నువ్వ ఒక్కటి పెడతే.. ఎదుటోడు వంద పెడతాడు.. సో.. వాటిని నమ్ముకుని ఉండటం కష్టం. దీంతో ఆయన మళ్లీ ఛానల్ కోసం ప్రయత్నాలు చేయొచ్చని.. అందుకు ఏపీకి చెందిన ఓ ప్రముఖ పార్టీతోపాటు ఓ సామాజిక వర్గం నేతలు, పారిశ్రామికవేత్తలతో లాబీయింగ్ నడిపించొచ్చని భావిస్తున్నారు. దీన్ని పసిగట్టిన ఆ రెండు మీడియా సంస్థల ప్రతినిధులు.. రవి ప్రకాష్ కు సాయం చేయొద్దని ఒత్తిడి చేస్తున్నారంట. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే రవి ప్రకాష్ మళ్లీ రెచ్చిపోతారని అంటున్నారు. సో.. సొంత సామాజిక వర్గమే కాదు.. మీడియాలోని ఆ వర్గం నుంచి కూడా రవికి ఎదురుదెబ్బ తగులుతుంది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.