కొవ్వెక్కినోళ్లు, పనీపాట లేనోళ్లు మారథాన్ రన్స్ చేస్తారంట : టీవీ 5 విశ్లేషణ

August 26, 2018

మారథాన్ రన్.. ఇవి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంటాయి. అది కూడా ఆదివారం, పబ్లిక్ హాలిడేస్, ఇతర ప్రత్యేక రోజుల్లో నిర్వహిస్తారు. ఈ మారథాన్ నిర్వహించేది ఒళ్లు కొవ్వెక్కి, ఒళ్లు బలిసి.. పొట్ట కరగటానికి కాదు.. ఇది ఓ కాజ్ కోసం నిర్వహిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పట్టిపీడించే సమస్యలపై ప్రజల్లో అవగాహన కోసం, ఓ సమూహాన్ని ఏర్పాటు చేసి.. దాని ద్వారా ప్రజలకు చేరవేయటం ఈ మారథాన్ రన్ ఉద్దేశం. ఇండియాలో చాలా ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చినా.. ఆదివారం నలుగురితో కలిసి మెలిసి.. ఉదయం పూట ప్రకృతి అందాలను ఆహ్వాదిస్తూ.. ఓ పరుగు తీస్తే ఆ ఉత్తేజం వేరు అనేది ఈ మారథాన్ ఉద్దేశం. అదే విధంగా ఉద్దేశాన్న అందరికీ చేరవేయటం, వారి ద్వారా ఇతరులకు ఇది చేరటం అనేది జరుగుతుంది. ఆరోగ్యంతోపాటు ఆరోగ్యం.. ప్రజల్లో అవగాహన కోసం ఇలాంటివి చేస్తుంటారు అనేది మారథాన్ ఉద్దేశం.

టీవీ5 అనే తెలుగు టీవీ న్యూస్ ఛానల్.. మారథాన్ ఉద్దేశాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది. సిటీలో ఈ మారథాన్స్ ఏంటీ అని ప్రశ్నించింది. సిటీలో ఇలాంటి రన్స్ పెట్టటం వల్ల ట్రాఫిక్ అరాచకటం తలెత్తిందని వివరించారు. ఒళ్లు కరగటానికి, పొట్ట తగ్గించుకోవటానికి మారథాన్స్ పెట్టుకోవాలంటే.. రాచకొండగుట్టల నుంచి భువనగిరి దుర్గం వరకు పెట్టుకోవచ్చని.. సిటీ రోడ్లపై ఏంటీ దరిద్రపు పరుగు అన్నంతగా తన విశ్లేషణ సాగింది. ఆదివారం రోజు అందరూ ఇళ్లలో ఎందుకు ఉంటారు.. ఆదివారం కూడా పని చేసుకుంటే కానీ పొట్టనిండని ఎంతో మంది ఉన్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు టీవీ ఛానల్ డిస్కషన్ నిర్వహించిన మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ విజయ్. ట్రాఫిక్ పరంగా అరాచకం సృష్టించారని.. పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపారు. స్వయంగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఈవెంట్ కు హాజరుకావటం విశేషం. వారి మారథాన్ వల్ల ఎంతో మందికి ఇబ్బంది కలుగుతుందన్నారు. నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు పెట్టటం ఏంటని నిలదీశారు. హైదరాబాద్ లో ఉదయం 6 గంటలకే ట్రాఫిక్ జామ్ అయిపోయిందని, అంబులెన్స్ లు కూడా ట్రాఫిక్ అరాచకంలో చిక్కుకున్నాయని జర్నలిస్ట్ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులు పోలీసులతో గొడవ పడుతున్నారని గ్రౌండ్ రిపోర్ట్ అందించారు. మారథాన్ లను సిటీ శివార్లకు తరలించాలని గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

మారథాన్ రన్స్ పై టీవీ 5 ఛానల్ లైవ్ లో సీనియర్ జర్నలిస్ట్ విజయ్ ఇచ్చిన వివరణ ఎలా ఉన్నా.. వీవీఐపీలకు మాత్రం ఎక్కడో తగిలింది. ఎందుకంటే ఈ ఈవెంట్లకు హాజరయ్యేది ఆ పొలిటికల్ లీడర్స్, ఉన్నతాధికారులే కదా. ప్రముఖ పారిశ్రామికవేత్తలు మారథాన్ రన్స్ ను ప్రోత్సహిస్తూ ఉంటారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, ఇతర మంత్రులు చాలా సందర్భాల్లో ఇలాంటి మారథాన్ ఈవెంట్స్ లో పాల్గొన్నవారే. అంతేకాదు.. విజయవాడలో ప్రతి ఆదివారం ఉదయం రోడ్లన్నీ మూసేసి హ్యాపీ సండే అని ఏపీ సీఎం చంద్రబాబు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం టీవీ 5 ఛానల్ మారథాన్ పై విశ్లేషణను వారు ఎలా తీసుకుంటారు. మారథాన్ రన్ అనేది కొవ్వు తగ్గటానికి, తిన్నది అరగటానికి, పనీపాట లేనివాళ్లు చేసేది చెప్పిన విజయ్ గారి విశ్లేషణ.. ఎవరికి వర్తిస్తుందో వాళ్లకే తెలియాలి. ఈ విశ్లేషణతో అయినా ప్రపంచం మొత్తం మారథాన్ రన్స్ పై తన వైఖరి మార్చుకుంటుందా.. పోలీసులు పర్మీషన్స్ బ్యాన్ చేస్తారో లేక విజయ్ గారు సూచించినట్లు తెలంగాణ గుట్టల్లో పరుగులు పెట్టుకుంటారో చూడాలి..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.