TJS గల్లంతు : అగ్గిపెట్టె వెలగలేదు

December 11, 2018

తెలంగాణ జన సమితి పార్టీ గల్లంతు అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులు అందరూ ఓటమి చెందారు. ఏ నియోజకవర్గంలోనూ ప్రభావం చూపకలేకపోయారు. పోరాడి, కొట్లాడి మరీ 8 సీట్లు దక్కించుకున్నా.. ఏ స్థానంలోనూ కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. మూడు, నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నారు. కోదండరాం ఆధ్వర్యంలోని తెలంగాణ జన సమితి మొదటిసారి బరిలోకి దిగింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో కలిసి బరిలోకి దిగింది. మొదటిసారరే ఖాతా తెరవలేకపోయింది.

చిన్నబోయిన మాస్టారు :

తెలంగాణ జన సమితి పార్టీ ఘోర ఓటమితో కోడందరాం మాస్టారు చిన్నబోయారు. పార్టీ ఆఫీస్ వెలవెలబోయింది. కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోవటంపై ఆ పార్టీలోనే అంతర్మథనం ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత రచనారెడ్డి ఇప్పటికే బయటకు రావటం జరిగింది. కూటమి మాయలో మాస్టారు ఉన్నారని బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అదే నిజం అయ్యింది. టీజేఎస్ పార్టీ సింబల్ అయిన అగ్గిపెట్టె వెలగలేదు.. పార్టీని ఆదరించలేదు ప్రజలు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.