సీమాంధ్రుల్లో చీలిక : టీఆర్ఎస్ వైపు వైఎస్ఆర్ అభిమానులు

December 1, 2018

ఎమోషన్ లేదు తొక్కా లేదు.. గ్రాఫిక్స్ తప్ప అభివృద్ది లేదు.. మాయలు అన్నీ పటాపంచెలు అయ్యాయి.. ఆ సామాజిక వర్గం వాళ్లు చెప్పే మాటలు అన్నీ కూడా అబద్దాలు.. అభూత కల్పనలే అని తేలిపోయింది.. ఇంకా ఏందీ తక్కాతోటకూర.. సీమాంధ్రులు అందరూ ఒక్కటి కాదు.. అందులోనూ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంది అంటూ గట్టిగా.. అరిచి మరీ చెప్పారు సీమాంధ్రుల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు. సెప్టెబర్ 11వ తేదీ కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలోని సీమాంధ్రులు సమావేశం అయ్యారు. తెలంగాణలో ఎన్నికలపై చర్చించారు.

మా రూటు మాదే.. మీతో కలవం :

సీమాంధ్రులు అంటే ఎవరు.. అందరూ వస్తారు. కానీ వాస్తవం అలా లేదే.. సీమాంద్రులు అంటే ఓ సామాజిక వర్గం వాళ్లు.. ఆ వర్గం పార్టీకి చెందినోళ్లే అనే గోబెల్స్ ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలోనే ఇప్పుడు తేడా వచ్చింది. సీమాంధ్రుల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఏకం అయ్యారు. గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొడుతూ తెలంగాణ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తాం అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు కాబట్టి.. మా నిర్ణయం టీఆర్ఎస్ కే అని కుండబద్దలు కొట్టారు.

కాంగ్రెస్ – టీడీపీ దొందూ దొందే :

టీడీపీ మాకు రాజకీయ విరోధి.. అదే విధంగా కాంగ్రెస్ లో వైఎస్ స్థానంలో చంద్రబాబు ఫొటో పెట్టారు.. వైఎస్ ను కాదనుకున్న పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి.. అస్సలు ఇచ్చేదే లేదు అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయిలో టీఆర్ఎస్ వైపు ఉన్నాం అని.. ఇప్పుడు కూడా అదే విధంగా గులాబీ దళానికి వెన్నుదన్నుగా ఉంటామని ఏకాభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ – టీడీపీ దొందూ దొందే అని.. ఇక నుంచి ఆ రెండు పార్టీలకు మా కంఠంలో ప్రాణం ఉండగా మద్దతు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు అభిమానులు. టీడీపీ, ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారంలో పడొద్దని.. ఆ పత్రికలు, టీవీల్లో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని సీనియర్స్, మేధావులు యువతకు సూచించారు. 2014 ఎన్నికల్లో విజన్, పగ, ప్రతీకారం అంటూ మోసం చేశారని.. అప్పుడు ఎమోషన్స్ ఉన్నాయని.. ఇప్పుడు అంతా క్లారిటీ వచ్చిందన్నారు. కంటి వెలుగు బాగుందని.. ఇదే చూపుతో.. గులాబీ దళం వెంట నడుద్దాం అని పిలుపునిచ్చారు కొందరు పెద్దలు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.