అనుకున్న‌దొక్క‌టీ.. శేరిలింగంప‌ల్లి స‌భలో జ‌రిగిందొక్క‌టీ

August 14, 2018

కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన శేరిలింగంప‌ల్లి సీమాంధ్రుల స‌భ మైలేజ్ తీసుకొచ్చిందా.. ఎందుకు కాంగ్రెస్ శ్రేణులు డీలా ప‌డ్డాయి.. ఎంతో ఆర్భాటంగా ప్ర‌చారం చేసినా ఎందుకు ప్ర‌జ‌ల నుంచి ఆశించిన స్థాయిలో స్పంద‌న రాలేదు.. ఇలాంటి విష‌యాల‌పై ఇప్పుడు పార్టీలోని కొంద‌రి నేత‌ల్లో అప్పుడే చ‌ర్చ మొలైంది. వారం రోజుల ముందు నుంచే శేరిలింగంప‌ల్లిలో సీమాంధ్రుల టార్గెట్ గా స‌భ నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అనుకున్న‌ట్లే నేత‌లు అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేశారు. రాహుల్ హైద‌రాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగారు అని తెలిసిన వెంట‌నే.. భారీ ఎత్తున ప్ర‌జ‌లు స‌భా ప్రాంగ‌ణానికి త‌ర‌లివ‌చ్చారు. వాళ్లూవీళ్లూ అని తేడా లేకుండా జ‌నంతో స‌భ నిండుగా క‌నిపించింది. దీంతో హ్యాపీగా ఫీల‌యిన కాంగ్రెస్ నేత‌లు.. మ‌రో గంట‌కే.. అన‌గా 6 గంట‌ల స‌మ‌యానికే డ‌ల్ అయ్యారు.
షెడ్యూల్ ప్ర‌కారం కంటే గంట‌న్న‌ర ఆల‌స్యంగా స‌భావేదిక‌పైకి వ‌చ్చారు రాహుల్ గాంధీ. అప్ప‌టి వ‌ర‌కు లోక‌ల్ లీడ‌ర్స్ ప్ర‌సంగాలు సాగాయి. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు కాంగ్రెస్ లీడ‌ర్స్ స్పీచ్ లు దంచికొట్టారు. గంట‌న్న‌ర నుంచి వీరి మాట‌లు విన్న ప్ర‌జ‌లు.. రాహుల్ గాంధీ వేదిక ఎక్క‌గానే ఒక్క‌సారిగా కెవ్వుకేక అన్నారు. ఆ త‌ర్వాత వెంట‌నే వెనుదిర‌గ‌టం మొద‌లైంది. అప్ప‌టి వ‌ర‌కు 15వేల మంది ప్ర‌జ‌లు వ‌చ్చార‌ని అంచ‌నా వేశారు. గ్రౌండ్ నిండుగా క‌ళ‌క‌ళ‌లాడుతుంది. ఇక రాహుల్ స్పీచ్ ప్రారంభం అయ్యే స‌మ‌యానికి స‌గం గ్రౌండ్ ఖాళీగా క‌నిపించింది. 15వేల మందిలో క‌నీసం 13వేల మంది తెలంగాణ వారే అని గ్రౌండ్ లో బ‌హిరంగంగానే మాట్లాడుకోవ‌టం క‌నిపించింది. రాహుల్ స్పీచ్ ప్రారంభం కాక‌ముందే.. అంద‌రూ తిరుగుముఖం ప‌ట్టారు. వాహ‌నాలు వ‌చ్చిన కొంత మంది మాత్రమే అక్క‌డ ఉన్నారు.
సీమాంధ్రులు అంద‌రూ ఆఫీసుల‌కు, ప‌నుల్లోకి వెళ్లిపోవ‌టం, స‌భా వేదిక‌పై ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డిని సైతం పెట్టినా ఎవ‌రూ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. సీమాంధ్ర ఓట్లు అనట‌మే వారికి ఇరిటేష‌న్ గా అనిపించింది. దీనికితోడు మ‌రోసారి కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తుంద‌నే అప‌వాదు కూడా మూట‌గ‌ట్టుకుంది. సీమాంధ్రుల‌కు కాంగ్రెస్ పై ఇంకా కోపం పోలేద‌ని ఈ స‌భ ద్వారా మ‌రోసారి రుజువు అయ్యింది. ఏపీలో అయితే.. ఉంటే టీడీపీ లేక‌పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వైపే ఉన్నార‌ని మ‌రోసారి రుజువు అయ్యింది. ఇక తెలంగాణ‌లో రూటు కాంగ్రెస్ వైపు కాద‌ని విస్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చిన శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ సీమాంధ్రుల స‌భ‌..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.