రూపాయి ఊపిరి ఆగింది

August 14, 2018

రూపాయి రూపాయి ఏం చేస్తావ్ అని అడిగితే.. కుటుంబంలో చిచ్చు పెడ‌తా.. బంధువుల‌తో వైరం తెస్తా అని డాబుస‌రి పోయింది రూపాయి.. అదే రూపాయి ఊపిరి ఇప్పుడు ఆగిపోయింది. రూపాయి రూపాయి ఏం చేస్తున్నావ్ అని అంటే.. పాతాళంలో ప‌డ్డాను.. ద‌య‌గ‌ల మారాజు ఎవ‌రైనా ఉంటే పైకి లేపండీ అని ఏడుస్తోంది. అవును మ‌రి.. మ‌న రూపాయే.. ఇప్పుడు దేశ‌చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో విలువ ప‌డిపోయింది. రెండేళ్ల క్రితం డాల‌ర్ తో రూపీ విలువ 65 రూపాయ‌లు అంటే.. ఆల్ టైం అనుకుని పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టుకున్నాం.. క‌న్నీళ్లు కార్చాం. ఇప్పుడు అదే రూపాయి డాల‌ర్ విలువ‌తో పోల్చితే 70 రూపాయ‌ల‌కు చేరింది. అంటే ఒక అమెరికా డాల‌ర్ మ‌న తీసుకోవాలి అంటే 70 రూపాయలు ఇవ్వాలి. ఇది అమెరికాలో స్థిరప‌డిన ఎన్నారైల‌కు పండ‌గ చేసుకుంటారు. ఇండియాలోని సామాన్యులు బేల‌గా చూస్తారు.

ఎన్నారైల‌కు ఎందుకు పండ‌గంటే..

మ‌న దేశం నుంచి ఉద్యోగాల కోసం.. వ్యాపారాల కోసం అమెరికాలో ప‌ని చేస్తుంటారు క‌దా. వారు ఇండియాకు డ‌బ్బులు పంపిస్తారు. గ‌తంలో వెయ్యి డాల‌ర్లు పంపితే 60, 65వేలు వ‌చ్చేవి.. ఇప్పుడు 70వేలు అయ్యింది. అంటే డాల‌ర్ ఒక‌టే.. ఇండియా రూపాయే త‌గ్గిపోయింది. దీంతో ఎన్నారైలు పండ‌గ చేసుకుంటున్నారు. పార్ట్ టైం, ఓవ‌ర్ టైం చేసి మ‌రీ డాల‌ర్లు తెగ సంపాదించేస్తున్నారంట‌. ఎందుకంటే.. రూపాయి ప‌డిపోయిందిక‌దా.. ఇప్పుడు ఎక్కువ డ‌బ్బులు ఇంటికి పంపించొచ్చు క‌దా. గ‌తంలో వెయ్యి డాల‌ర్లు పంపితే 65వేలు అయ్యేవి.. ఇప్పుడు 950 డాల‌ర్లు పంపితే చాలు 65వేలు అవుతున్నాయి.

భార‌తీయుల‌కు క‌ష్టం ఎందుకంటే..

రూపాయి విలువ ప‌డిపోయింది కాబ‌ట్టి.. వ‌స్తువుల ధ‌ర‌లు కూడా పెరుగుతాయి. 10 రూపాయ‌లు చెల్లించే వ‌స్తువుకి 11 రూపాయ‌లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 90శాతం పెట్రోల్, డీజిల్ విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నాం క‌దా.. ఆ డ‌బ్బును డాల‌ర్ల‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా అద‌నంగా మ‌న డ‌బ్బు విదేశాల‌కు త‌ర‌లిపోతుంది. దీనికితోడు క్రూడ్ అయిల్ ధ‌ర‌లు పెరుగుతాయి. అది ర‌వాణాపై ప‌డుతుంది. ఈ విధంగా మొత్తం ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. మొత్తంగా రూపాయి ఊపిరి అగింది.. సామాన్యుడి జేబు జిల్లు ప‌డింది.. ఎన్నారైలు పండ‌గ చేసుకుంటున్నారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.