టీడీపీతో పొత్తు పెట్టుకోలేదనే..!లగడపాటి కుట్ర వెనుక అసలు వాస్తవం ఇదే..!!

December 6, 2018

ఏపీ ముఖ్యమంత్రి . టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే ఓ మాట చెబుతూ ఉంటారు. అదేమిటంటే.. తాను టీఆర్ఎస్ తో కలిసి వెళ్దామనుకున్నాను కానీ.. కేసీఆర్ ఒప్పుకోలేదని. అది నిజమే.. టీఆర్ఎస్ తో పొత్తు కోసం కాళ్లావేళ్లా పడింది టీడీపీ. కొంత మందితో మధ్యవర్తిత్వం కూడా జరిపారు. కానీ.. కేసీఆర్ ఒప్పుకోలేదు. తెలంగాణ ద్రోహిని.. మళ్లీ తెలంగాణకు తీసుకు రావడానికి అంగీకరించలేదు. ఈ మధ్యవర్తుల్లో లగడపాటి కూడా ఉన్నారు. అందుకే నిన్న ప్రెస్ మీట్‌లో… తాను టీడీపీని వదులుకోవద్దని చెప్పానని చిలుకపలుకు పలికారు.

ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌-టీడీపీ పొత్తుకు యత్నించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌.. అవి బెడిసికొట్టడంతో ఇప్పుడు సర్వేల పేరుతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని.. ఆయన మాటలతో తేలిపోయింది. టీడీపీని ఎలాగోలా బతికించాలనే తాపత్రయం లగడపాటిలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు ఏర్పాటులో ఆయనే క్రియాశీల పాత్ర పోషించారు. నందమూరి హరికృష్ణకు నివాళి అర్పించేందుకు వెళ్లినపుడు చంద్రబాబు కూడా పొత్తు ప్రస్తావనను కేటీఆర్ వద్ద తీసుకొచ్చారు. దానికి కేటీఆర్ అంగీకరించలేదు.రాజగోపాల్‌ కూడా టీడీపీని టీఆర్‌ఎస్‌తో కలిపేందుకు సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి ప్రయత్నించారు. ఒక కామన్‌ ఫ్రెండ్‌ దగ్గర కేటీఆర్‌తో దీనిపై చర్చించారు. కానీ కేసీఆర్ అంగీకరించలేదు. దీంతో దృష్టి అటువైపు మళ్లించి కాంగ్రెస్‌- టీడీపీల మధ్య పొత్తు కుదిర్చారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ప్రజా కూటమి ఏర్పాటులో లగడపాటి క్రియాశీల పాత్ర పోషించారు. అందుకే.. సర్వేలు అనుకూలంగా చెబుతున్నారు. కానీ.. తెలుగుదేశం పార్టీని తెలంగాణ నుంచి తరిమికొట్టే లక్ష్యంతో.. కేసీఆర్.. పడనీయలేదు.

కేసీఆర్ చేయించిన అనేక సర్వేల్లో.. టీడీపీకి అర శాతం.. ఒక శాతం కూడా.. ఓటింగ్ లేదని తేలింది. అయినప్పటికీ.. టీడీపీకి ఆరు శాతం ఓటింగ్ ఉందని.. చెప్పి.. మభ్యపెట్టి.. ఏదో చేయాలని… లగడపాటి ప్రయత్నించారన్న విషయం ఇప్పుడు బయటపడుతోంది. ఏం జరిగినా.. తెలంగాణలో మాత్రం టీడీపీకి చోటు లేదు. ఈ విషయంలో ప్రజలందరిదీ ఏకాభిప్రాయం.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.