ర‌వి ప్ర‌కాష్ కొత్త ఛాన‌ల్ R9

May 15, 2019

తెలుగు మీడియా ట్రెండ్ సెట్ట‌ర్ ర‌వి ప్రకాష్ ఖాళీగా ఏమీ లేరంట‌. కేసుల గోల న‌డుస్తూనే ఉంటుంది.. ఇప్పట్లో క్లారిటీకి వ‌చ్చేది కాదు కాబట్టి.. అజ్ణాతంలోనే ఉండి కొత్త ఛాన‌ల్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారంట‌. పేరు కూడా డిసైడ్ చేశారు. R9 పేరుతో రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఆర్ అంటే ర‌వి ప్ర‌కాష్. ఆర్ అంటే రిల‌య‌న్స్. ముంబైలో ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌కు బ‌లం చేకూర్చుతూ R9 పేరుతో తెలుగులో కొత్త న్యూస్ ఛాన‌ల్ తీసుకురాబోతున్నారు. రిల‌య‌న్స్ ఒప్పుకోక‌పోతే.. ఎన్నారైల ఆధ్వ‌ర్యంలో తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు లైసెన్స్ లు అంటే క‌ష్టం కాబ‌ట్టి.. పాత ఛాన‌ల్ లైసెన్స్ ఒక‌టి తీసుకుని పేరు మార్చుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంట‌.
R9 ఛాన‌ల్ ను వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టాలు ఎక్కించాల‌నే ఆలోచ‌న కూడా చేస్తున్నారంట‌. మోజో టీవీలో ర‌వి ప్ర‌కాష్ వాటాదారుడు, ఆ ఛాన‌ల్ అత‌నిదే అనే ప్ర‌చారం జ‌రుగుతుంది. వీలును బ‌ట్టి మోజో టీవీ పేరు మార్చి R9 గా తీసుకురావాల‌నే ఆలోచ‌న ఎలా ఉంటుంద‌ని స‌న్నిహితుల‌తో చ‌ర్చించిన‌ట్లు టాక్.
ఈసారి జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు. ఒక ట్రెండ్ సెట్ట‌ర్ అయ్యి ఉండి చేతిలో టీవీ లేకుండా పోవ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న ర‌వి ప్రకాష్.. ఈసారి మాత్రం త‌న పేరుతో చాన‌ల్ లాంచ్ చేయాల‌నే క‌సిలో ఉన్న‌ట్లు అత‌ని స‌న్నిహిత మిత్రులు అంటున్నారు. ఛాన‌ల్ ఏదైనా.. పెట్టుబ‌డి ఎవ‌రిదైనా ర‌వి ప్ర‌కాష్ ఛాన‌ల్ పేరు మాత్రం R9 క‌న్ఫామ్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆల్ ద బెస్ట్ సార్..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.