రాహుల్ గాంధీని బుజ్జగించండి : చంద్రబాబుకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు

May 28, 2019

టైటిల్ చూసి పళ్లు కొరకొద్దు.. బీపీ పెంచుకోవద్దు.. రాజకీయాల్లో ఏమైనా సాధ్యమే.. ఏమైనా జరగొచ్చు. 2019 ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్న రెండే రెండు పార్టీల్లో ఒకటి కాంగ్రెస్, రెండోది టీడీపీ. పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ బాధ్యతలను తలకెత్తుకుని మరీ దేశవ్యాప్తంగా తిరిగిన చంద్రబాబు.. సోనియా, రాహుల్ గాంధీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మొదటిసారి తెలుగువారి ఆత్మగౌరవం 10 జన్ పథ్ లో సగర్వంగా ల్యాండ్ అయ్యింది. చంద్రబాబుగారి పోరాటం, విజన్ చూసి చాలా ముచ్చటపడిన రాహుల్ గాంధీ.. భవిష్యత్ లోనూ కలిసి పోరాటం చేయాలని అప్పుడే నిర్ణయించారు.
కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా చిత్తు అయ్యింది. ఈ క్రమంలోనే పార్టీ బాధ్యతలను వదులుకోవటానికి సిద్ధం అయ్యారు. నాలుగు రోజులుగా సాగుతున్న పార్టీ అంతర్మథనంలో రాహుల్ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఈ క్రమంలోనే కురువృద్ధులు అయిన కాంగ్రెస్ హైకమాండ్ నేతలు… ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఫోన్ చేశారంట. మీరు వచ్చి మా అధ్యక్షుడు రాహుల్ గాంధీని బుజ్జగించాలని కోరారు అంట. చంద్రబాబు అంటే.. రాహుల్ గాంధీకి ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉన్నాయని.. చంద్రబాబు విజన్ చూసి తెలంగాణలో కలిసి పోటీ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారంట. మీరు వచ్చి రాహుల్ గాంధీని బుజ్జగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. మీ మాట అంటే ఎంతో గౌరవం అని.. హైకమాండ్ నేతలు చంద్రబాబుతో అన్నారంట.
కాంగ్రెస్ హైకమాండ్ మాటలు విన్న చంద్రబాబు.. రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కొనసాగాలని.. గెలుపోటములు కామన్ అని రాహుల్ గాంధీతో చంద్రబాబు హితబోధ చేయనున్నట్లు తెలుస్తోంది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.