ఓటు వేద్దాం.. తెలంగాణ వాదాన్ని రక్షించుకుందాం..!

December 6, 2018

తెలంగాణ రాష్ర్టానికి ఆయువు పట్టు తెలంగాణ వాదం. ఈ వాదాన్ని రక్షించుకోవటమంటే జాతి అస్తిత్వాన్ని పరిరక్షించటమే. టీఆర్ఎస్ తోనే ఈ తెలంగాణ వాదం పరికక్షితమవుతుంది. సంక్షేమ బాటలో ప్రజల్ని కన్న బిడ్డలుగా చూస్తున్న కేసీఆర్ కు ఈ వాదాన్ని పరిరక్షించే హర్కు ఉంది. ప్రజాహితం కోసం ఇన్ని పథకాలు, ప్రణాళికలు రచించిన సీఎం మరొకరు లేరు. సాధారణంగా ప్రజలు వేరు, ఓటర్లు వేరు. కానీ కేసీఆరే తన ప్రసంగాలతో ఓటు హక్కులేని వాళ్లను కూడా తన అయస్కాంత క్షేత్రంలోకి ఆకర్షించగలిగారు.రెప్పపాటు కూడా పోని కరెంటు ఇచ్చి దేశం దృష్టిని తనవైపు మళ్లించుకున్నరు!

రైతులకు బీమా పథకాన్ని కేసీఆర్ ప్రారంభించిన రోజు సంబంధిత ఎల్‌ఐసీ ఉన్నతాధికారి కూడా ఇట్లాంటి పథకాన్ని అమలుపరుచటానికి ఎంతో దార్శనికత అవసరమన్నాడు. మహిళలకు నెలవారీ పింఛన్ కల్పించాలన్న ఆలోచన అత్యంత మానవీయం. మహిళలు ఎన్నో విషాదాలకు లోనై, ఊహకందని పరిణామాల మూలంగా ఒంటరి మహిళలుగా మిగిలిపోయి కుటుంబాలు లేక కుమిలిపోతుంటారు. అట్లాంటి వారిని ఆదుకుంటున్న కేసీఆర్ అనాథల పాలిట చిన్నాన్న కాగలిగారు. ఆసరా పేరుతో అస లు సిసలు పెద్దకొడుకుగా రంగప్రవేశం చేస్తున్నారు కేసీఆర్. వికలాంగులది అనుక్షణ సమస్య. పదిహేను వందల నుంచి మూడువేల రూపాయలకు పింఛన్ పెరుగనుండటంతో వారిలో బతుకుపట్ల భరోసా ఏర్పడుతుంది.

కేసీఆర్ కళ్యాణలక్ష్మీ ప్రారంభించి, లక్షా నూట పదహారు రూపాయల కట్నంతో మేనమామగా పెండ్లి పందిట్లోకి ప్రవేశిస్తున్నారు! ఇది ఆ రెండు కుటుంబాల వారికే కాదు ఆ పెండ్లికి హాజరయ్యే బంధుమిత్రులందరికీ చిరస్మరణీయ ఘట్టం కాగలుగుతున్నది ఈ పథకాన్ని మతాతీయ దృష్టితో అమలుపరిచినట్లే, గురుకుల వ్యవస్థను కూడా మతాతీయ దృష్టితో ప్రోత్సహించిన కేసీఆర్ నాణ్యమైన విద్యకు మంచి పునాదులు వేశారు. ఆశావర్కర్లు, అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, హోంగార్డులు, బీడీ కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడిపే పద్ధతిలో కేసీఆర్ పింఛన్లను, వేతనాలను సమకూర్చటంతో ఆయా వర్గాల్లోని 80 శాతం గృహిణులు తమ కుటుంబాల్లోని ఆబాలవృద్ధుల సంక్షేమానికి కృషిచేస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ వాదంతోనే సాధ్యమయ్యాయి. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.