మోడీ మాటల డేటా.. స్పీచ్ అనాలిస్ ఇది

August 15, 2018

72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి మోడీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ భవిష్యత్, తన విజన్ ఆవిష్కరించారు. గంటన్నర పాటు సాగిన సుదీర్ఘ ప్రసంగంలో రాబోయే ఎన్నికలను గుర్తు చేసింది. మెజార్టీ వర్గాలను టచ్ చేస్తూ.. వారికి చేసిన సేవలను గుర్తు చేస్తూ ముందుకు సాగారు. ఐదు సంవత్సరాలు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి.. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. 2014 నుంచి 2018 వరకు ఏయే అంశాలను ఎక్కువ ప్రస్తావించారు.. ఏ సంవత్సరంలో ఏ అంశాలను హైలెట్ చేశారు అనే మోడీ మాటల డేటా.. స్పీచ్ అనాలసిస్ ఇప్పుడు చూద్దాం..

వ్యవసాయం రంగంపై..
2014లో అస్సలు మాట్లాడలేదు. 2015లో మాత్రం 13 సార్లు వ్యవసాయం, రైతులను ప్రస్తావించారు. 2016లో నాలుగు సార్లు స్పందిస్తే.. 2017లో మాత్రం తన స్పీచ్ లో వ్యవసాయం రంగం ప్రస్తావనే లేదు. 2018 ఇప్పుడు మాత్రం 11సార్లు వ్యవసాయం, రైతు అంశాలను తన స్పీచ్ లో ప్రస్తావించారు.

టెర్రరిజం అంశంపై..
2014, 2015, 2016 సంవత్సరాల్లో ఉగ్రవాదం, ఉగ్రదాడులపై అస్సలు మాట్లాడలేదు మోడీ. 2017లో అత్యధికంగా 8సార్లు తన ప్రసంగంలో టెర్రరిజం అంశం చోటుచేసుకుంది. ఇప్పుడు 2018లో మాత్రం మూడు సార్లు టెర్రరిజం అంశంపై మాట్లాడారు.

ఉద్యోగం, ఉపాధి అంశాలపై..
2014లో 7సార్లు ఉద్యోగాలపై మాట్లాడారు. 2015లో మాత్రం ఉద్యోగ, ఉపాధి అంశాన్ని టచ్ చేయలేదు. అదే 2016లో త్రం 7 సార్లు ఈ అంశాన్ని టచ్ చేస్తే.. ఇప్పుడు 2018లో మాత్రం ఒకే ఒక్క మాట ఉద్యోగ, ఉపాధిపై మాట్లాడారు.

GST అంశంపై..
2014, 2015, 2016 సంవత్సరాల్లో GST అంశం అస్సలు ఎత్తలేదు.. 2017 మాత్రం ఎక్కవగా అంటే 8 సార్లు GST అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు 2018లో మాత్రం నాలుగు సార్లు మాత్రమే GSTపై మాట్లాడారు.

దళితులపై దాడుల అంశంపై..
దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, ఎస్సీ, ఎస్టీ చట్టంలో సవరణ అంశం జోలికి పోలేదు ప్రధాని మోడీ. 2014, 2015, 2016, 2017 సంవత్సరాల్లో ఎర్రకోట ప్రసంగాల్లో దళితుల అంశమే లేదు. ఇప్పుడు 2018 మాత్రం ఒకే ఒక్కసారి ఈ అంశంపై మాట్లాడారు.

పల్లెలు, గ్రామీణ ప్రాంతం :
2014 స్పీచ్ లో అత్యధికంగా ప్రసంగం అంతా పల్లెలు, గ్రామీణ ప్రాంతాలపైనే సాగింది. 29 సార్లు తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. 2015లో 11 సార్లు, 2016లో 15 సార్లు, 2017లో పల్లెత్తిమాట అనలేదు.. ఇప్పుడు 2018లో 7 సార్లు గ్రామీణ, పల్లె ప్రస్తావన వచ్చింది.

స్వచ్ఛ భారత్, టాయిలెట్స్ :
2014లో 7 సార్లు, 2015లో 9 సార్లు, 2016లో 4 సార్లు మాట్లాడితే.. 2017లో అస్సలు మాట్లాడలేదు. 2018లో మాత్రం 4 సార్లు మాత్రమే స్పందించారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.