ఉత్తమ్ గడ్డంపై సోషల్ మీడియాలో సెటైర్లు

December 11, 2018

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించే వరకు గడ్డం తీయనని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అంటూ శపథం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే ఇప్పుడు అందరి చూపు. ఫలితాల్లో కాంగ్రెస్ జోరు మొదలైన వెంటనే.. ఉత్తమ్ గడ్డం ఎప్పుడు తీసుకుంటారు.. బ్లేడ్ పంపించాలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు మీకు కావాల్సినంత టైం వచ్చింది.. మంచి సెలూన్ చూపించుకుని గడ్డం గీయించుకోండి అంటూ సలహాలు పడేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సెలూన్ మా ఏరియాలో ఒకటి ఉంది.. మీకు ఫ్రీగా చేస్తాం అంటూ మరికొందరు ఆఫర్స్ ఇస్తున్నారు.. ఇన్నాళ్లూ గడ్డంతో చూసి బోర్ కొడుతుంది.. ఇప్పటికైనా గడ్డం తీసి న్యూ లుక్ లో రండి.. అప్పుడైనా లక్ కలిసి వస్తుందేమో చూద్దాం అంటూ మరికొందరు చురకలు అంటిస్తున్నారు. మొత్తానికి ఉత్తమ్ గడ్డం కథ ముగిసింది అంటున్నారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.