పరకాల సర్వే : ఏపీలోనూ టీఆర్ఎస్ వైపే మొగ్గు

December 5, 2018

తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే.. ఏపీలోనూ పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కు వెళ్లింది. సీఎం చంద్రబాబు రోజుల తరబడి తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తుండటంతో.. ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతుంది.. ఏ పార్టీవైపు ప్రజలు ఉన్నారు అనేది ఏపీ ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ ఎన్నికలపై సర్వే చేసిన పరకాల ప్రభాకర్.. ఏపీలోనూ ప్రజల నాడిని పట్టేశారు. షాకింగ్ విషయాలు వచ్చినట్లు అతని టీం నుంచి వచ్చిన సమాచారం.

ఏపీలోనూ టీఆర్ఎస్ హవానే :

తెలంగాణలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని ఏపీ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. చంద్రబాబు మాటలను మేమే నమ్మటం లేదు.. అలాంటిది తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారనే ప్రశ్న ప్రజల నుంచి స్వచ్ఛందంగా రావటం విశేషం అని పరకాల టీం అంటోంది. ఏపీలో కూడా వేలుపెడతాం అని కేటీఆర్ అన్న మాటలపై అభిప్రాయం కోరితే.. మా చంద్రబాబు తెలంగాణ ఎలా ఇస్తారు.. ఏపీని ఎలా విడగొడతారు అని దుమ్మెత్తిపోశాడు.. అలాంటి మనిషి అన్నీ మర్చిపోయి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయటం లేదా అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలుస్తుంది అని అనుకున్నామా ఏంటీ.. కలలో కూడా ఊహించలేదు.. అలాంటిది టీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి వస్తే తప్పేంటని అంటున్నారు.

ఏపీ బెట్టింగ్స్ లో టీఆర్ఎస్ లీడ్ :

ఏపీలో జోరుగా సాగుతున్న బెట్టింగ్స్ లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు బెట్టింగ్ రాయుళ్లు. పార్టీల వారీగా చూస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎక్కువ మంది బెట్టింగ్ కాస్తున్నారు. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే శేరిలింగంపల్లి, కూకట్ పల్లిపైనే ఎక్కువగా ఉన్నాయి అంటోంది పరకాల సర్వే రిపోర్ట్


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.