ధియేటర్లు ఖాళీ : కథానాయకుడిని బరించటం కష్టమే

January 9, 2019

ధియేటర్లు ఖాళీ : కథానాయకుడిని బరించటం కష్టమే
ఉన్న మాట అంటే జీర్ణించుకోవటం కష్టమే.. కలర్ మీడియా కథనాలు చూస్తే కన్నీళ్లు ఆగటమూ కష్టమే.. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయుడు మూవీ హంగామా నడుస్తోంది. సినిమా అత్యద్భుతం అని.. ఇలాంటి సినిమాకి రేటింగ్ ఇవ్వటం కష్టమని ఒకరు అంటే.. మరో ఎల్లో మీడియా ప్రపంచంలో ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ తెరపై చూడలేదంటూ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ జీవితం కూడా దేవుడి తర్వాతే అన్నట్లు కీర్తించేసింది. రాతల్లో తమ అభిమానాన్ని, సామాజిక వర్గం రక్తాన్ని రంగరించి మరీ రాశారు. ఇలాంటి కళాఖండం ప్రపంచం సినీ చరిత్రకే మకుటం అన్నట్లు రాసేశారు. కలర్ మీడియా ఎంత కోటింగ్ ఇచ్చినా.. ఏది నిజం – ఏది అబద్ధం అని తెలుసుకోవటానికి మరో మీడియా ఉంది. అదే న్యూ మీడియా. కథానాయకుడు అసలు సిసలు రివ్యూ ఇప్పుడు చెబుతాం.. ఊ కొట్టండి..

కథ :
ఎన్టీఆర్ జీవితం. సినీ రంగ ప్రవేశం. నిమ్మకూరు నుంచి మద్రాస్ చేరి.. అక్కడ సినిమా అవకాశాలు దక్కించుకుని.. స్టార్ గా మారిన వైనమే కథ. ఎన్టీఆర్ లాగే, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజులతోపాటు చిరంజీవి కూడా ఇలాగే కష్టపడి పైకి వచ్చారు. కాకపోతే ఎన్టీఆర్ కుటుంబాన్ని బాగా హైలెట్ చేసి చూపించారు. ఎన్టీఆర్ జీవితంలో ఎదురైన అనుభవాలు, ఎదుగుతున్న టైంలో వచ్చిన అడ్డంకులను చూపించారు. అందరికీ తెలిసినవే .. కాకపోతే కథను ఆసక్తికరంగా చూపించటానికి ప్రయత్నించారు. ట్విస్టులు, పేస్టులు లాంటివి ఏమీ ఉండవు.

ఎలా నడిచింది :
ఫస్టాప్ స్లోగా నడుస్తుంది. నీరసంగా ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఓ పాత్ర వస్తుంది. ఎన్టీఆర్ సినిమాల్లో వేసిన అన్ని వేషాలు.. ఆయన కుమారుడు బాలయ్య మరోసారి వేశారు. కొన్ని సూట్ అయ్యాయి. ఎక్కువగా సూట్ కాలేదు. ఎన్టీఆర్ వేసిన వేషాలన్నీ ఒకే సినిమాలో చూపించినట్లు అనిపిస్తుంది. సందేహాలు, తొక్కా తోలు ఏమీ ఉండవు. ఓ 20 సినిమాలను బిట్స్ బిట్స్ గా చూసినట్లు అనిపిస్తోంది. ఫస్టాప్ బోరింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ స్టార్టింగ్ కూడా పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. చివరి 20 నిమిషాలు ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవటం, ఆ సందర్భంగా కుటుంబం, మిత్రులతో జరిగిన సంభాషణలు, రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనకు కారణం, ప్రేరణలు ఉంటాయి. తెలుగువారి ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారంటూ అప్పట్లోనే ఓ కలర్ మీడియా లేనిపోని వార్తలు, కథనాలు వండి వార్చినట్లు అందరికీ తెలిసిందే. రాజకీయాలు బాగా తెలిసిన వాళ్లకు మాత్రం ఈ 20 నిమిషాలు కూడా నవ్వులు తెప్పిస్తాయి. సొంత ఎమోషన్స్ ను.. తెలుగోళ్ల ఎమోషన్ గా చూపించటానే తాపత్రయం తెరపై బాగా కనిపించింది.

సామాన్యుడి ఫీలింగ్ :
సినిమా ఏముందీ.. ఎన్టీఆర్ వేషం బాలయ్య వేస్తే ఎలా ఉందో అలాగే ఉంది. కొత్తగా ఏమీ లేదనే భావన వ్యక్తం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ధియేటర్లలో ఫస్ట్ షో కూడా ఫుల్ కాలేదు. రెండో ఆట నుంచి కావాల్సినన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మల్టీఫ్లెక్సుల్లో అయితే వేలాది టికెట్లు.. బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. టికెట్ కొడదాం అన్నా క్యూలో ఎవరూ లేని దుస్థితికి వచ్చేసింది. ఏపీలోని ఇదే పరిస్థితి. ఎక్కడా హౌస్ ఫుల్ బోర్డులు లేకపోవటం చూస్తుంటే.. కలర్ మీడియా రివ్యూ కోటింగ్స్ అన్నీ ఉత్తివే అని తేల్చేశారు నెటిజన్లు. కలర్ మీడియా అదేనండీ ఎల్లో మీడియాలో రివ్యూలు చూసి.. ధియేటర్లు ఖాళీ ఫొటోలు తీసి పెడుతున్నారు.

మూవీ హైలెట్స్ ఇలా ఉన్నాయి :

  • ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన కథానాయుడు మూవీ మొదటి భాగం. ఇందులో ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాలు మాత్రమే ఉన్నాయి. క్లయిమాక్స్ లో రాజకీయాల్లోకి వెళుతున్నట్లు చెబుతారు. అంతటితో మూవీ ముగుస్తోంది.
  • నిమ్మకూరు నుంచి మద్రాస్ వెళ్లటం, సినిమాల్లోకి వెళ్లే ముందు ఇంట్లోవారి అభిప్రాయాలు, సినీ రంగంలో ఎంట్రీ ఎలా జరిగింది.. ఎలా ఎదిగారు.. తిరుగులేని స్టార్ స్థాయికి చేరుకున్న విధానాన్ని చూపించారు బాలయ్య.
  • తండ్రి పాత్రలో ఇట్టే ఒదిగిపోయాడు బాలయ్య. కొన్ని సన్నివేశాలు, పాత్రల్లో జీవించేశారు బాలయ్య. కొన్ని పాత్రల్లో నిరుత్సాహం వస్తోంది. వెంటవెంటనే పాత్రలు, వేషధారణ మారిపోతుండటం మిగతా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తోంది. చాలా సీన్స్ అభిమానుల కోసం మాత్రమే తీశారన్నట్లు ఉంటాయి. నందమూరి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మిగతా ప్రేక్షకులు తలలు బాదుకుంటారు.
  • ఫస్టాప్ కొంచెం స్లోగా అనిపిస్తోంది. మూవీకి సెకండాఫ్ చివరి 25 నిమిషాలు మాత్రమే నిలబెట్టింది. స్టోరీతో కనెక్ట్ కారు.
  • కీరవాణి అందించిన సంగీతం బాగా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీకే ప్లస్ పాయింట్.
  • బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ పేలిపోయాయి. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే ఫిదా అయ్యారు. కామన్ ప్రేక్షకుడికి కొంచెం ఎక్కువగా అనిపించాయి.

ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.