థాయ్ లాండ్, కాంబోడియాలో నారా లోకేష్ కు ట్రైనింగ్

August 13, 2018

ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్.. ఓ నెల రోజులు మాయం కాబోతున్నారా.. 30 రోజులు విదేశాల్లో శిక్షణ తీసుకోబోతున్నారా.. మానసిక వికాశం, ఒత్తిడిని జయించటం ఎలా.. మాట్లాడే సమయంలో ఎలా ఉండాలి.. నలుగురితోపాటు 4 లక్షల మంది ప్రజల ముందు ఉండే సమయంలో ఎలాంటి హావభావాలతో ఉండాలి.. తనకు తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలి.. ఇలాంటి విషయాలపై థాయ్ లాండ్, కాంబోడియాలోని సుశిక్షుతులైన బౌద్ధ భిక్షకుల దగ్గర ట్రైనింగ్ ఇప్పించనున్నట్లు ఏపీలో చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల్లోనూ విస్త్రృతస్థాయిలో దీనిపై డిస్కషన్ నడుస్తోంది. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి.
లోకేష్ కామెంట్స్ ట్రోలింగ్ :
నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అతని వ్యవహారశైలి చాలా సందర్భాల్లో నవ్వులపాలు అయ్యింది. పప్పు అనే ముద్ర పడింది. అతను స్వయంగా చేసే కామెంట్సే పార్టీకి నెగెటివ్ ప్రచారం తెచ్చిపెడుతున్నాయి. జయంతి – వర్థంతి, మా నాన్నేనే చూడలేదు, కాంగ్రెస్ కు ఓటేయండి ఇలాంటి ఎన్నో మాటలు మైనస్ అయ్యాయి. పర్యటనల్లోనూ నేతలు, కార్యకర్తల తీరుపై బహిరంగంగానే విరుచుకుపడటం, సహనం కోల్పోవటం వంటివి చినబాబు కెరీర్ కు ఇబ్బందిగా మారాయి. చాలా సందర్భాల్లో అతని మాటలే తలనొప్పిగా మారాయని పార్టీలో మోస్ట్ సీనియర్ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే కంట్రోల్ చేస్తున్న చంద్రబాబు.. తన రాజకీయ వారసుడిని మరింత తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.
రాహుల్ గాంధీ బాటలో.. ఆయన ఆలోచనల నుంచే :
2015లో రాహుల్ గాంధీ 60 రోజులు మిస్ అయ్యారు. ఆయన థాయ్ లాండ్, కాంబోడియాలో పర్యటించారు. వచ్చిన తర్వాత అతనిలో విపరీతమైన మార్పు. కాంగ్రెస్ పప్పు నుంచి ఇప్పుడు.. కాంగ్రెస్ పీఎం రేసులో ఫస్ట్ ప్లేస్ కు వచ్చాడు. నలుగురిలో తిరుగుతున్నాడు.. డేరింగ్ కామెంట్స్ చేస్తున్నాడు.. ముందూ వెనకా ఆలోచిస్తున్నాడు.. అందర్నీ కలుపుకుని పోతున్నాడు.. ఈ మార్పుకి కారణం.. థాయ్ లాండ్, కాంబోడియాలో బౌద్ధ భిక్షవుల దగ్గర శిక్షణ తీసుకోవటమే. ఓ సాధారణ వ్యక్తిగా వారి దగ్గర బోధనలు వినటమే. ఇటీవల థాయ్ లాండ్ గుహల్లో చిక్కుకున్న పిల్లల ఫుట్ టీం.. 18 రోజులు ఆహారం లేకుండా చీకటి గుహలో బతికారు. దీనికి కారణం వారి కోచ్ ఇచ్చిన ప్రేరణ, ధ్యానం. ఇలాంటి శిక్షణే రాహుల్ తీసుకున్న తర్వాత పప్పు ముద్ర నుంచి బయటపడ్డాడు. భవిష్యత్ నేతగా ఎదిగాడు. నిర్ణయాలు తీసుకోవటంలో చలాకీగా ఉంటున్నాడు. ఇటీవల బెంగళూరులో కలిసిన సందర్భంగా ఈ విషయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
రాహుల్ లాంటి శిక్షణే.. నారా లోకేష్ కు అవసరం :
రాహుల్ గాంధీ తీసుకున్న శిక్షణ తరహాలోనే.. థాయ్ లాండ్, కాంబోడియాలోని బౌద్ధ భిక్షవుల దగ్గర చినబాబుకి కూడా శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఎన్నికల ఏడాది.. ఇప్పుడు లోకేష్ ను తీర్చిదిద్దకపోతే.. తన తర్వాత లోకేష్ కు మరింత కష్టాలు ఎదురవ్వటం ఖాయం. తన అధికారంలో ఉండగానే.. లోకేష్ ను మరింతగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా.. ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ట్రైనింగ్ నిజమో.. అబద్దమో.. వెళతాడో లేదో కానీ.. చంద్రబాబుతో ప్రతిరోజూ టచ్ లో ఉండే వారు మాత్రం ఇదే విషయంపై మాట్లాడుకోవటం విశేషం.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.