ప్రలోభాల్లో బరి తెగించారు..! గెలుపు కోసం కూటమి కుట్రలు..!

December 6, 2018

ప్రజాభిమానం ఎలాగూ లేదని అర్థం చేసుకున్న మాయా కూటమి అభ్యర్థులు.. చివరి ప్రయత్నంగా గంగగుత్తగా ఓట్లు కొనుగోలు చేసేందుకు నోట్లతో బరితెగించారు. ఆంధ్ర నుంచి వెల్లువలా వస్తున్న నోట్ల కట్టలను ప్రజలపైకి వెద జల్లుతున్నారు. అవి తీసుకుని కూటమికే ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ వంద కోట్లకుపైగానే నగదు పట్టుబడింది. అంతా.. మహాకూటమి అభ్యర్థుల కోసం.. తరలిస్తున్న సొమ్మే. అంతా ఆంధ్ర ప్రదేశ్ నుంచి వస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మహాకూటమి నేతలు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. నిన్న ఒక్క రోజే… తెలంగాణ వ్యాప్తంగా.. మహాకూటమి నేతలు.. ఆరేడు వందల కోట్లు పంపిణీ చేశారని ప్రచారం జరుగుతోంది.

దానికి తోడు మద్యం కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. ఈ విషయంలో కొద్ది రోజుల నుంచి మహాకూటమి నేతలు పక్కా ప్లానింగ్ తో ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముందుగానే గోడౌన్లకు మద్యాన్ని తరలించి.. మెల్లగా.. వాటిని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు.. రేపు…ఓటింగ్ సమయంలో కూడా.. తమ నగదు పంపిణీ వ్యవహారాలను చక్క బెట్టుకునేందుకు మహాకూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయలో వీరంతా ఓ సిండికేట్‌గా మారారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హవాలా వ్యాపారులు కూడా.. మహాకూటమిలో ఎక్కువ మంది ఉన్నారు. దాంతో వారికి నగదు కొరత లేకుడా పోతోంది.

డబ్బులు, మద్యంతో.. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని మాయా కూటమి అప్రతిష్ట పాలు చేస్తంది. ఈ విషయంలో ప్రజల్లో రియలైజేషన్ వస్తోంది. ఇంత భారీగా డబ్బు పెట్టి.. వారంతా తెలంగాణను లొంగ తీసుకుని… ఆంధ్రకు తాకట్టు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారన్న అనుమానాలు వారిలో ప్రారంభమయ్యాయి. లేకపోతే.. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా… నోట్ల పంచకుండా రాజకీయం చేస్తూంటే.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇలా ఎలా పంచుతుదన్నది వారి.. ఆలోచన. చంద్రబాబు పంపించపోతే.. ఎక్కడి నుంచి వస్తాయి. ఏపీ ప్రజల సొమ్మును దోపిడీ చేసి.. ఇలా పంచుతున్నారు. ఇది నిజమే కదా..మరి..!


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.