అసలు సర్వేను తొక్కి పెట్టి దుష్ప్రచారం..! వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీదే..!?

December 3, 2018

ఆంధ్రా అక్టోపస్ అంటూ ఆంధ్రావాదులు కిరీటం పెట్టిన లగడపాటి… సర్వే పేరుతో కొంత మంది హడావుడి చేస్తున్నారు.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెబుతున్నారు కానీ.. వాస్తవంగా… వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీలోనే. ఇది ఆయన సర్వే రిపోర్ట్‌లోనే వెల్లడయింది. ఓ టీవీ చానల్ ప్రతినిధితో పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు లగడపాటి రాజగోపాల్ ఈ విషయాన్ని చెప్పారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశమే లేదని… పాజిటివ్ ఓటు పడబోతోందని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. తానెప్పుడూ చెప్పలేదన్న విషయాన్ని కూడా చెప్పారట.

లగడపాటి… ప్రముఖ చానల్ ప్రతినిధితో మాట్లాడినప్పుడు… ఆయన చెప్పిన లెక్కల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర సమితికి క్లియర్ మెజార్టీ వస్తుంది. టీఆర్ఎస్ కు 64 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అంటున్నారు. అదే సమయంలో.. ఎంఐఎంకు… ఏడు స్థానాలు వస్తాయి. అదే సమయంలో ఇంతకు ముందే ఆయన చెప్పినట్లు… ఇండిపెండెంట్లు కూడా…ఎనిమిది నుంచి పది స్థానాల్లో గెలుస్తారు. బీజేపీకి నాలుగు నుంచి ఐదు సీట్లు లభించవచ్చు. ఇక మహాకూటమికి 30 ప్లస్ సీట్లు వస్తాయని లెక్క తేల్చారు. మూడునెలల కిందట సర్వే చేసినప్పుడు ఇదే రాజగోపాల్ 90 సీట్లు వస్తాయని చెప్పారు. కానీ రెండు నెలల్లో..టీఆర్ఎస్‌కు అనుకూలంగా వాతావరణం మారినా సీట్లు తక్కువ చేసి చెబుతున్నారు.

లగడపాటి సర్వేల పేరుతో ఇప్పటికే కొన్ని సర్వేలు కూటమిపేరుతో విడుదల చేసుకుని బెట్టింగ్ వ్యాపారానికి పాల్పడుతున్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో… చాలా మంది అనుమానం అలాగే ఉండిపోయింది. అందుకే లగడపాటి సర్వేలు చెప్పినా… పందేలు కాయకూడదన్న భావనల్లో ున్నారు. ఎలక్షనీరింగ్ ను పక్కాగా చేసుకోవడం వంటి అంశాల్లో టీఆర్ఎస్ ఎక్కువ పట్టు. .. క్యాడర్ ఉంది కాబట్టి.. అంతిమంగా… 70 సీట్లకుపైగానే.. టీఆర్ఎస్‌కు వస్తాయని… కరుడుగట్టిన ఆంధ్రా వాదుల అభిప్రాయం. నిజానికి తెలంగాణ వాదుల్లో మాత్రం ఈ సంఖ్య 100గా ఉంది. పదకొండోతేదీన అసలు రిజల్ట్ తేలిపోనుంది. దుష్ప్రచారానికి ముగింపు పడనుంది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.