అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టరు..! తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వైపే..!!

December 6, 2018

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదు. కొన్ని తాయిలాలు, సంక్షేమ పథకాల అమలుకే ఆ పార్టీ పరిమితమైపోయింది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ఇందుకు భిన్నం. తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే వారి బతుకుల్లో వెలుగులు నింపవచ్చునో కేసీఆర్ బాగా అర్థం చేసుకున్నారు. ప్రజల సమస్యల పట్ల అవగాహన, వాటి పరిష్కారం పట్ల స్పష్టత, దశాబ్దాలు సొంతగడ్డపైనే రెండవ శ్రేణి పౌరులుగా అవమానాలు పొందిన తెలంగాణ ప్రజలకు గౌరవప్రదమైన జీవితాలనివ్వాలనే తపన గల కేసీఆర్ గత ఎన్నికల్లో తదనుగుణమైన ప్రణాళికను సమాజం ముందుంచారు. అందులోని ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేశారు.

స్వతంత్ర భారతంలో అమలైన తొలి ఎన్నికల మ్యానిఫెస్టో టీఆర్‌ఎస్‌దే! ఎన్నికల ప్రణాళికలో చెప్పిన పథకాలతో పాటు ప్రజలు కోరకుండానే వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేసీఆర్ అమలుచేశారు. ప్రజల ఓట్లు పొందడానికి ఏ జిమ్మిక్కులు, కుట్రలు, కుతంత్రాలు, నీతిబాహ్య పొత్తులు టీఆర్‌ఎస్‌కు అవసరం లేదని కేసీఆర్ నిరూపించారు. చేసిన పను లు చూపి ఓట్లడుగుతున్న తొలి ముఖ్యమంత్రి చరిత్రలో కేసీఆర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇన్ని పథకాలను, ఇంత తక్కువకాలంలో అమ లుచేయడం మరే ముఖ్యమంత్రికైనా సాధ్యమా? . ఇప్పటికే ముప్ఫై వేలకు పైగా నియామకాలు పూర్తికాగా మరో 80 వేలకు పైగా నియామకాలకు ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్‌మెంట్ బోర్డ్ లు తమ పని చేసుకుంటూ పోతాయి. 2004 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి పదేండ్ల పాలనలో పదివేల ఉద్యోగా లు ఇవ్వలేదు.

కానీ టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఈ నాలుగేండ్లలో ముప్పై వేల కు పైగా ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు, 22 వేల విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసింది. సింగరేణి బొగ్గు గనుల్లో డిపెండబుల్ ఉద్యోగాల కల్పన చేయగలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అనేక ఇం జినీరింగ్ కళాశాలలకు అనుమతులు ఇచ్చారు. వివిధ పథకాల లబ్ధిదారుల్లో 90 శాతం ఓటర్లు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, తమ జీవితాల్లో వచ్చిన మార్పు లు, కేసీఆర్ సమర్థతపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.