ఐదే.. 5 నిమిషాలు.. ఇండియాలో అతిపెద్ద ఫేక్ న్యూస్ ఇదే

September 1, 2018

బావా ఎక్కడున్నావ్.. ఎప్పుడొస్తున్నావ్ అంటే మనం ఠక్కున చెప్పే సమాధానం 5 నిమిషాల్లో వస్తున్నా అని.. మావా నీ కోసం వెయిట్ చేస్తున్నా అంటే ఐదు నిమిషాల్లో నీ ముందు ఉంటా అంటాం.. ఎంతసేపట్లో వస్తున్నావ్ అంటే ఐదు నిమిషాల్లో వచ్చేస్తున్నా అని చెబుతాం.. మావా వస్తున్నావా రావట్లేదా అంటే ట్రాఫిక్ లో ఉన్నా 5 నిమిషాల్లో వచ్చేస్తా.. ఏంటీ 5 నిమిషాలు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియాలోని ఈ 5 నిమిషాలపై ఎందుకు మాట్లాడుకుంటోంది.. ఈ 5 నిమిషాల అబద్ధం ఎలా పుట్టింది.. ఎలా వాడుకలోకి వచ్చిందో తెలుసుకుందాం..

ఇండియాలోనే అతిపెద్ద ఫేక్ న్యూస్ 5 నిమిషాలు :

ఇండియాలో 5 నిమిషాల అబద్దం చెప్పనివారు ఉండరు.. లేరు అని ఘంఠాపథంగా చెబుతోంది ప్రపంచం. ప్రతి భారతీయుడు ఈ 5 నిమిషాల అబద్దాన్ని తన జీవితకాలంలో ఎన్నో సమయాల్లో వాడతారంట. ఒక్క ఇండియాలోనే ఈ 5 నిమిషాలు వాడతారంట. ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల్లో నిన్న, రేపు అని వాడతారు. లేదా మర్టిక్యులర్ టైం చెబుతారు. అందుకు భిన్నంగా ఒక్క భారతీయులు మాత్రం 5 నిమిషాల పదం వాడతారు. ఇది అత్యంత అబద్దం అని.. ఇండియాలోనే అతిపెద్ద ఫేస్ న్యూస్ అని తేల్చింది ప్రపంచం. నిజమైన భారతీయుడు కూడా ఐదు నిమిషాల్లో వస్తున్నా.. ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటా అని చెబుతాండంట.

5 నిమిషాలు ఎలా వాడుకలోకి వచ్చింది :

1947 సెప్టెంబర్ 1వ తేదీన ఇండియాలో కొత్త టైం జోన్లు వచ్చాయి. అదే gmt+5.30 అవర్స్ తో స్టార్ట్ అయ్యింది. అంతకు ముందు భారతదేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో టైం జోన్ ఉండేది. బాంబే ప్రావిన్స్ లో అయితే ఏకంగా మూడు టైం జోన్లు ఉన్నాయి. ఒకటి చర్చిగేట్, రెండోది మహీంకి, మూడోది రైల్వే. ముంబై మహానగరంలోనే మూడు టైమ్స్ ఉండేది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో టైం నడుస్తుంది. ఎవరైనా ఒక జోన్ నుంచి మరో జోన్ కు ట్రావెల్ చేసే సమయంలో.. ఐదు నిమిషాలు తేడాతో వెళుతూ ఉండేవారు. ఉదాహరణకు చర్చిగేట్ దగ్గర టైం ఉదయం 10 గంటలు అయితే.. అదే మహింకీ దగ్గరకు వచ్చే సరికి 10 గంటల 5 నిమిషాలుగా ఉండేది. అదే రైల్వే టైం మరో 5 నిమిషాలు తేడా ఉండేది. దీంతో ముంబై ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే.. ఆ ప్రాంతంలోని టైం జోన్ కు అనుకూలంగా 5 నిమిషాలు ముందు లేదా తర్వాత బయలుదేరి వెళుతుండేవారు. చర్చిగేట్ నుంచి మహింకీకి 10 గంటలకు చేరుకోవాలని అనుకుంటే.. వారు ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లేవారు. వెళ్లిన వ్యక్తి కరెక్ట్ టైంకి వెళ్లినా.. అక్కడి టైం ఐదు నిమిషాలు లేటుగా చూపించేది సమయం. ఎవరైనా ఫోన్ చేసినా, కబురు చేసినా ఇదిగో 5 నిమిషాల్లో వస్తున్నా అని చెప్పేవారు. అలా వాడుకలోకి వచ్చిందే ఈ ఐదు నిమిషాలు

రైల్వే శాఖ నుంచే.. 5 నిమిషాల అబద్దం విస్త్రృతం :

ముంబై ప్రావిన్స్ లో రైల్వే టైం తేడాగా ఉండేది. 1880 నుంచి 1885 మధ్య కాలంలో బాంబే గవర్నర్ రెండు సార్లు తను ఎక్కాల్సిన రైలు మిస్ అయ్యాడు. దీనికి కారణం డిఫరెంట్ టైం జోన్ కారణం. ఇది కూడా ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లటం వల్ల. గవర్నర్ ఇంటి నుంచి కరెక్ట్ టైంకే బయలుదేరినా.. రైల్వే టైం తేడా కావటంతో 5 నిమిషాల తేడాతో ట్రయిన్ మిస్ అయ్యాడు. దీంతో ఈ 5 నిమిషాలు అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికితోడు రైళ్ల లేటును కనీసం 5 నిమిషాల నుంచి ప్రారంభించేవారు ఒకటి, రెండు, మూడు నిమిషాలు అని కాకుండా.. 5 నిమిషాలు ఆలస్యం అని చెబుతుండేవారు. ఇది రైల్వేశాఖకు ఊతపదంగా మారిపోయింది. అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే కావటంతో.. ప్రజలు కూడా ఈ 5 నిమిషాల అబద్దానికి బాగా కనెక్ట్ అయిపోయారు.

ఒక్కో ప్రాంతానికి ఒక్కో టైం జోన్ :

బాంబేతోపాటు మద్రాస్ ప్రెసిడెన్స్, కోల్ కతా ప్రెసిడెన్సీ టైం జోన్లలోనూ సమయం తేడా ఉండేది. కోల్ కతా అందరి కంటే ముందు ఉండేది. కోల్ కతాలో ఉదయం 6 గంటలు అయితే.. మిగతా ప్రాంతాల్లో 5 గంటల 50 నిమిషాలుగా టైం ఉండేది.

పంచువాల్టీలో ఇండియన్స్ లీస్ట్ :

టైం మేనేజ్ మెంట్, టైంకి రావటం, వెళ్లటం అనే విషయంలో ఇండియన్స్ వరస్ట్ అని తేల్చేసింది ప్రపంచం. టైం అంటే అబద్దం అని అన్నంతగా భారతీయులు అలవాటు పడిపోయారు. రైలు అంటే చాలు జీవితకాలం లేటు అనే సామెత కూడా ఉంది. ఆధునిక కాలంలో కొంచెం మెరుగుపడినా.. 2017-18 సంవత్సరంలోనే 30శాతం రైళ్లు లేటుగా నడిచాయి. ఇక విమానాల విషయంలో అత్యంత దరిద్రమైన టైం నడుస్తుందంట ఇండియాలో. ముంబై – ఢిల్లీ విమానాలు అయితే అస్సలు టైం పాటించవని ప్రపంచ టైం మేనేజ్ మెంట్ సంస్థ ఏకిపారేసింది. ఇండియన్స్ కు టైంతో తమ జీవితాలు బాగా ముడిపడి ఉంటాయి.. అదే స్థాయిలో 5 నిమిషాల అబద్దం కూడా జీవితం భాగం అయిపోయింది అంటోంది ప్రపంచం.

ఇంతకీ ఈ టైం గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అంటారా.. సెప్టెంబర్ 1వ తేదీనే ఇండియా మొత్తానికి ఒకే టైం జోన్ అమల్లోకి వచ్చిన రోజు..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.