జ‌న‌సేన మ్యానిఫెస్టో చూసి.. చంద్ర‌బాబు, జ‌గ‌న్ షాక్

August 14, 2018

స‌మాజాన్ని మారుస్తా.. మారుస్తా అని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పూర్తిగా మారిపోయారు. ఫ‌క్త్ రాజ‌కీయ పార్టీలా వ్య‌వ‌హ‌రించారు. ఆగ‌స్ట్ 15వ తేదీకి జ‌న‌సేన మ్యానిఫెస్టో ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన‌ట్లుగానే.. ప్ర‌క‌టించేశారు. కాక‌పోతే కొత్త‌ద‌నం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మార్పు ఉచితంతో రాద‌ని.. అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని.. అంద‌రికీ ఉద్యోగ, ఉపాధి క‌ల్పించాల‌ని త‌ను అనునిత్యం వ‌ల్లెవేస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా మేనిఫెస్టో ప్ర‌క‌టించి.. సీఎం చంద్ర‌బాబు, ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ ల‌ను షాక్ కు గురి చేశారు. రిజ‌ర్వేష‌న్లకు వ్య‌తిరేకం అన్న ప‌వ‌న్.. ఇప్పుడు అవే రిజ‌ర్వేష‌న్లతోపాటు ఉచిత హామీల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం మిగ‌తా పార్టీల‌ను షాక్ కు గురిచేసింది.

హామీలు

మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు
గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో రూ.2,500.. రూ.3,500/ వరకు నగదు
బీసీలకు అవకాశాన్ని బట్టి 5% రిజర్వేషన్లు పెంపుదల
చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతి గృహాలు
ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు
ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు
వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు

 సిద్ధాంతాలు

కులాలను కలిపే ఆలోచనా విధానం
మతాల ప్రస్తావన లేని రాజకీయం
భాషలను గౌరవించే సంప్రదాయం
సంస్కృతులను కాపాడే సమాజం
ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం
అవినీతిపై రాజీలేని పోరాటం
పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.