గుంటూరు పార్లమెంట్ పరిధిలో.. టీడీపీకి బీసీ వర్గాల షాక్

March 1, 2019


గుంటూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో టీడీపీకి బిగ్ షాక్. బీసీ సంఘాలు అన్నీ ఒక్కటయ్యాయి. తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ ఇచ్చాయి. దీనికి కారణం.. ఓ OC సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే టికెట్లు ఇవ్వాలనే డిమాండ్ పుట్టుకురావటమే. ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని టీడీప అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఇద్దరు సీనియర్ నేతలు.. ఓ ప్రతిపాదన చేశారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీలకే సీట్లు కేటాయించాలని సూచించారు. ఈ సలహాను సీఎం చంద్రబాబు సాధ్యం కాదని కొట్టిపారేశారు. అయినా కూడా ఆ సీనియర్ నేతలు మంగళగిరి నియోజకవర్గంలో అయినా ఓసీకి ఇవ్వాలనే ప్రతిపాదన తెచ్చి.. టీడీపీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండ, పత్తిపాడు నియోజకవర్గాలు SC రిజర్వ్. వాటిని వదిలేసి మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాలు అయిన మంగళగిరి, పొన్నూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులుగా ఓసీల్లోని ఆ సామాజికవర్గానికే టికెట్లు ఇవ్వాలనేది ఆ నేతల డిమాండ్.

ఓసీలకే సీట్లపై బీసీ సంఘాల ఆగ్రహం :
ఓ సామాజిక వర్గం చేస్తున్న కుట్రల్లో భాగంగానే ఓసీలనే బరిలోకి దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించిన బీసీ సంఘాలు ఒక్కటయ్యాయి. ఇదే జరిగితే అత్యధికంగా ఓటు బ్యాంక్ ఉన్న బీసీల్లోని నేతలకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్నే తీసుకుంటే పద్మశాలీలు అత్యధికం. 60వేల ఓట్లు ఉన్నాయి. పద్మశాలీలను కాదని.. ఓసీలకు సీటు ఇస్తే టీడీపీ పార్టీకే వ్యతిరేకంగా పని చేయనున్నట్లు ప్రకటించాయి.

గంజి ఓటమికి కూడా OC సామాజిక వర్గమే కారణం :
2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై బరిలోకి దిగిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి ఓడిపోయారు. కేవలం 12 ఓట్లతో తేడాతోనే . దీనికి కారణం. ఆ సామాజిక వర్గమే అనేది స్పష్టం. పద్మాశాలీ సామాజిక వర్గానికి మద్దతు ఇవ్వటం ఇష్టంలేక.. ఆ సామాజిక వర్గం వాళ్లు అందరూ కూడా నోటాకి ఓట్లు వేశారు. 1,500 ఓట్లు నోటాకి పడ్డాయి. ఓ వార్డులోని ఓట్లు అన్నీ టడీపీకే పడతాయి అనుకుంటే.. అనూహ్యంగా నోటాకి పడ్డాయి. సొంత పార్టీ అభ్యర్థికి ఓటు వేయటం ఇష్టం లేక.. అలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ వేయకుండా.. నోటాకి వేసి.. టీడీపీ అభ్యర్థినే ఓడించారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.