స్మార్ట్ ఫోన్ లోనే సమయంతా….. తండ్రి ఫోన్ ను సముద్రంలో పడేసిన చిన్నారి

August 15, 2018

ఎక్కడికెళ్లినా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్ మత్తులో అందరూ మనిపోతున్నారు. పిల్లలు, పెద్దలు కారెవరూ అన్హరం అన్నట్లుగా స్మార్ట్ ఫోన్ ను వాడేస్తున్నారు. పంక్షన్ లకి వెళ్లినా, ఫ్యామిలీతో కలసి పిక్నిక్ కు వెళ్లినా, చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో ఎవరి పనిలో వారు బిజీ అయిపోతున్నారు. పక్క పక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోవడం మానేసి ఫేస్ బుక్ ఓపెన్ చేసి అందులో పలకరించుకుంటున్నారంటే స్మార్ట్ ఫోన్ కి ఎంతగా బానిసైపోయారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుటుంబసభ్యులు ఓ చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకునే రోజులు ఎప్పుడో పోయాయి. స్మార్ట్ ఫోన్ అధికంగా వాడుతున్నాడని నాలుగేళ్ల పాప తండ్రి ఫోన్ ని సముద్రంలో పడేసింది. రష్యాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రష్యాకి చెందిన తిమతి అనే ఓ సెలబ్రిటి… ఓ యాచ్ లో తన కుటుంబంతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో తన కుటుంబసభ్యులను నిమిషమైనా పట్టించుకోకుండా స్మార్ ఫోన్ తోనే సమయం గడుపుతున్నాడు. తిమతి కూతురు డాడీ అక్కడ చూడు చాలా బాగుంది, ఇక్కడ చూడు చాలా బాగుంది అంటూ ముద్దు ముద్దుగా మాటల్ని పట్టించుకోకుండా స్మార్ట్ ఫోన్ లో మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. తన తండ్రితో సరదాగా గడపాలనుకున్న ఆ చిన్నారికి వసుగొచ్చి తండ్రి చేతిలోని స్మార్ట్ ఫోన్ ని సముద్రంలో విసిరేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. పిల్లలతో సమయం గడపే టైంలో కూడా స్మార్ట్ ఫోన్ ఎందుకని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ బానిసత్వాన్ని వదిలి ఎదురుగా ఉన్న వాళ్లతో మాట్లాడండి రా నాయనా అంటూ ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. పక్క పక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోవడం మానేసి ఫేస్ బుక్ లో పలకరించుకుంటున్నారంటే నేటి తరం స్మార్ట్ ఫోన్ కి ఎంతగా బానిసైపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.