క‌రుణానిధికి ముగ్గురు భార్య‌లు, ఆరుగురు పిల్ల‌లు

August 7, 2018

త‌మిళ‌నాడు రాజ‌కీయ కురువ్రుద్దుడు, మాజీ సీఎం క‌రుణానిధి చ‌నిపోయారు. 2018, ఆగ‌స్ట్ 7వ తేదీ సాయంత్రం 6.10గంటల‌కు చెన్నైలోని కావేరి ఆస్ప‌త్రిలో తుది శ్వాస విడిచారు. 94 ఏళ్ల క‌రుణానిధికి ముగ్గురు భార్య‌లు, ఆరుగురు పిల్ల‌లు ఉన్నారు. 1924 జూన్ 3న జ‌న్మించిన ఆయ‌న అస‌లు పేరు ద‌క్షిణామూర్తి. చిన్న వ‌య‌స్సులోనే 20 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే ప‌ద్మావ‌తి అమ్మాళ్ అనే యువతిని పెళ్లాడు. ఆమె ద్వారా ముత్తు అనే కుమారుడు క‌లిగారు. ప‌ద్మావ‌తి అమ్మాళ్ 1944లో అనారోగ్యంతో చ‌నిపోయారు.

ఆ త‌ర్వాత ద‌యాళు అమ్మాళ్ ను వివాహం చేసుకున్నారు క‌రుణానిధి. ఆమె ద్వారా అళ‌గిరి, స్టాలిన్, త‌మిళ‌ర‌సు, సెల్వి పుట్టారు. అప్ప‌టికే ఐదుగురు సంతానం క‌లిగి ఉన్నారు. 20 ఏళ్లు ద‌యాళు అమ్మాళ్ తో క‌లిసి ఉన్న ఆయ‌న‌.. 1966లో రాజాథి అమ్మాళ్ ప‌రిచ‌యం అయ్యింది. ఆమెతో సాన్నిహిత్యం ద్వారా ప్ర‌స్తుత ఎంపీ క‌నిమొళి పుట్టారు. క‌నిమొళి పుట్టిన త‌ర్వాత 1968లో అసెంబ్లీ సాక్షిగా త‌న‌కు రాజాథి అమ్మాళ్ తో వివాహం అయ్యిందని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. మొత్తంగా క‌రుణానిధికి ముగ్గురు భార్య‌లు, ఆరుగురు పిల్ల‌లు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.