దళిత సీఎంను అడ్డుకున్నది కాంగ్రెస్సే : షబ్బీర్ చెప్పిన పచ్చినిజం

December 6, 2018

దళిత సీఎంను చేస్తానన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు అంటూ గొంతు చించుకునే కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కు ఒక్క రోజు ముందు సెల్ఫ్ గోల్ వేసుకుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలనే ప్రభావితం చేయగల కాంగ్రెస్ నైజం బయటపడింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళిత వ్యక్తిని పెట్టాలని సీఎం కేసీఆర్ సోనియా దగ్గర డిమాండ్ పెట్టారు. దీనికి కాంగ్రెస్ అధిష్టానం ఒకే చెప్పలేదు. దళిత సీఎంను చేయటానికి వీల్లేదని.. ఆ డిమాండ్ వదులుకోవాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీంతో కేసీఆర్.. కాంగ్రెస్ తో విలీనం, పొత్తును విబేధించారు.

షబ్బీర్ చెప్పిన వీడియో సాక్ష్యం ఇదే :

నాకు తెలిసిన నిజం ప్రకారం అయితే దళిత సీఎం చేయాలని డిమాండ్ పెట్టారు కేసీఆర్.. మా హైకమాండ్ మాత్రం అలాంటి కండీషన్స్ పెట్టకూడదు మీరు అని అంది. ఆ తర్వాత మళ్లీ నేను కేసీఆర్ గారిని అడిగాను ఏంటీ సంగతి అని.. అప్పుడు కూడా ఆయన అదే స్టాండ్ పై ఉన్నారు. దళిత సీఎం కావాలి.. నా కండీషన్ ఇది.. మీరు ఇస్తారా.. ఇవ్వరా అనేది మీ ఇష్టం.. కానీ దళిత ముఖ్యమంత్రి మాత్రం కావాలి తెలంగాణ రాష్ట్రానికి అని కేసీఆర్ గట్టిగా చెప్పారు. కండీషన్ గా కాకుండా లెటర్ ఇచ్చి ఉంటే బాగుండేది.. కేసీఆర్ మాత్రం దళిత సీఎంకి పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ హైకామాండ్ అంగీకరించలేదు. దీంతో విలీనం జరగలేదు.. పొత్తు కుదరలేదు. దానికి నేనే సాక్ష్యం అన్నారు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు కాంగ్రెస్ సీనియర్ నేత, కూటమి వస్తే డిప్యూటీ సీఎం అవుతాను అంటూ ప్రచారం చేసుకుంటున్న షబ్బీర్ అలీ.

అసలు విషయం షబ్బీర్ అలీ వెల్లడించిన విషయాలు కూటమి పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన దళిత సంఘాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇన్నాళ్లు కేసీఆర్ పై అభాండాలు వేశారా అని ప్రశ్నిస్తున్నాయి.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.