చిరంజీవి బయోపిక్ కూడా రెడీ

January 9, 2019

చిరంజీవి బయోపిక్ కూడా రెడీ
సినీ ఇండస్ట్రీలో బయోపిక్ సీజన్ నడుస్తోంది. సినీ, పొలిటికల్, స్పోర్ట్స్ ఇలా అందరి కథలు తెరపైకి వచ్చేశాయి. ఒకే ఒక్క కథపై మాత్రం అందరిలో ఆసక్తి నెలకొంది. అదే మెగాస్టార్ చిరంజీవి. కింది నుంచి వచ్చారు. సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేరు. స్వయంకృషితో ఎదిగి.. సినీ ఇండస్ట్రీకి ఛాలెంజ్ విసిరి.. మెనగాళ్లకు మొనగాడుగా మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి జీవితం కూడా త్వరలో వెండితెరపైకి రాబోతున్నది. చిన్నప్పటి నుంచి సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ అయిన వరకు సినిమా తీయాలనే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. ఫినిషింగ్ టచ్ లో ఉందనే టాక్ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తుగ్లక్ టైమ్స్ ప్రశ్నకు ఆయన సన్నిహితుల నుంచి మౌనమే సమాధానం కావటం కూడా విశేషం. లేదు అంటే ఖండించేవారు.. అలా జరగలేదు అంటే.. అర్థం చేసుకోండి.

రాజకీయాల జోలికి వెళ్లరు :
చిరంజీవి జీవితంలో ప్రజారాజ్యం అనే పార్టీ ఉంది. అది ఘోర పరాజయం. దాన్ని బయోపిక్ లో చూపించకూడదు అని అనుకుంటున్నారంట. కేవలం సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదుగుదలను మాత్రమే కథగా తీసుకున్నారు. ఎందరికో స్ఫూర్తిగా, కష్టే ఫలిగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. గాడ్ ఫాదర్ లేకపోతే సినీ ఇండస్ట్రీ ఎలా చేస్తుంది.. అప్పటికే ఓ సామాజిక వర్గం చేతుల్లో ఉన్న సినీ ఇండస్ట్రీలో మరో సామాజిక వర్గం వ్యక్తి హీరోగా ఎలా నిలదొక్కుకున్నాడు.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది చూపించబోతున్నారంట. త్వరలోనే చిరంజీవి బయోపిక్ కు సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతుంది. సైరా మూవీ తర్వాతే ఇది ఉండబోతుంది.

చిరంజీవి నటించటం లేదు :
చిరంజీవి బయోపిక్ లో చిరంజీవి నటించటం లేదు. కేవలం గెస్ట్ గా మాత్రమే కనిపించబోతున్నారు. కొణిదెల లేదా అల్లు ఫ్యామిలీలోని ఎవరో ఒకరిని చిరంజీవిగా చూపించబోతున్నట్లు సమాచారం. లేకపోతే ఇతర నటులను కూడా పరిశీలించే అవకావాలు లేకపోలేదు..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.