హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు

May 31, 2019

ఏపీలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత రెండు, మూడు రోజులు సమీక్షలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు బెజవాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. కరకట్ట నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంటికి వచ్చారు. 100 కోట్ల రూపాయలతో ఎంతో అద్భుతంగా నిర్మించుకున్న ఈ ఇంటిలో చంద్రబాబు ఫ్యామిలీ ఉంటుంది. ఏపీలో ఓటమి తర్వాత బెజవాడ కరకట్ట నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు.. నేరుగా ఆస్పత్రికి వెళ్లి జాయిన్ అయ్యారు. గచ్చిబౌలిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. మే 30వ తేదీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే హైదరాబాద్ వచ్చి ఆస్పత్రిలో చేరటం.. అందులోనూ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చూపించుకోవటంతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది కార్యకర్తలు, అభిమానుల్లో.
మే 31వ తేదీ ఉదయం ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు అక్కడ అడ్మిన్ అయ్యారు. మూడు గంటలపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. చాలా రకాల పరీక్షలు నిర్వహించారు వైద్యులు. రొటీన్ చెకప్ అయితే వెంటనే వచ్చేస్తారు.. అలా కాకుండా మూడు గంటలు ఆస్పత్రిలోనే ఉండటంపై చంద్రబాబు అనారోగ్యం ఏంటా అనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లోనే ఉంది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.