వైసీపీ గెలిస్తే.. జగన్ పై కుట్ర చేస్తారా : రామోజీ – చంద్రబాబు భేటీపై వైసీపీ అనుమానాలు

May 16, 2019


ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఏపీ సీఎం చంద్రబాబు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లటం, ఈనాడు అధినేత రామోజీ, ఆయన కుమారుడు స్వయంగా ఆహ్వానం పలకటం ఈ ఫొటోలో స్పష్టం తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు వారం రోజుల ముందు వీరి భేటీ ఆసక్తి సంచలనంగా మారింది. చంద్రబాబు – రామోజీ భేటీ అనగానే.. గతం గుర్తుకొచ్చింది అందరికీ.
నాడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘటన కళ్ల ముందు మెదిలింది. ఎందుకంటే నిన్నటికి నిన్నే కదా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వీరి బంధం గురించి ఈతరానికి కూడా స్పష్టంగా తెలిసింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న ఐదేళ్ల క్రితం జగన్ ను జైలుకు పంపినప్పుడు, అతనిపై కేసుల గురించి టన్నుల కొద్దీ వార్తలు రాసిన సంఘటనలు అందరికీ ఠక్కు.. ఠక్కున గుర్తుకొచ్చాయి. సరిగ్గా ఎలక్షన్స్ రిజల్ట్స్ కు ముందు.. జగన్ గెలుస్తాడని ఎగ్జిట్ పోల్స్ లో కూడా స్పష్టంగా తెలుస్తున్న సమయంలో చంద్రబాబు – రామోజీ ప్రత్యేక భేటీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.
జగన్ గెలుస్తాడని జాతీయ ఛానల్స్ లో కూడా వార్తలు వస్తున్న సమయంలో.. వారం రోజుల ముందు వీరి భేటీ జరగటం వెనక ఏమైనా కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. జగన్ పై ఏమైనా కుట్ర చేయటానికే వీళ్లు భేటీ అయ్యారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి గత చరిత్రలు చూస్తే మాత్రం ఇలాంటి అనుమానాలు, అపోహలు, ఆందోళనలు కలగక మానవు అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. అప్పట్లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు, జగన్ ను జైలుకి వెళ్లేవిధంగా రాతలు రాసింది.. లక్ష కోట్ల అవినీతి అనే అబద్దాన్ని పదేపదే రుద్దిన ఈ ఎల్లో మీడియానే కదా అని బహిరంగంగానే ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
ఏమైనా జరగొచ్చు.. వాళ్లు అలాంటి వాళ్లే అంటున్నారు. అయితే అప్పటి రోజులు పోయాయి.. ఫిఫ్త్ ఎస్టేట్ సోషల్ మీడియా ఉంది.. దీ.. జీవితం.. ఇప్పుడుగానీ కుట్రలు మొదలుపెడితే.. ఏటా వాతా తాట తీస్తాం అంటూ కస కసిగా పళ్లు నురుముతున్నారు వైసీపీ అభిమానులు. ఏమైనా కాలంతోపాటు రోజులు మారాయి.. చూస్తూ ఊరుకోం అని మాత్రం వైసీపీ అభిమానులు గట్టిగానే.. బలంగా గుండెల్లో అనుకుంటున్నారు. అమ్మో వీరి ఆవేశం చూస్తుంటే.. కలర్ మీడియాకు.. కోటింగ్ గట్టిగానే మొదలుపెడతారేమో అనిపిస్తుంది.. కోట బద్దలు కావటం ఖాయమే.
ఎందుకంటే.. ఇప్పటికే ఓ వికెట్ డౌన్ అవ్వటం కళ్లారా చూస్తున్నాం కదా…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.