సింగపూర్ టూర్ వెళుతున్న చంద్రబాబు ఫ్యామిలీ

May 31, 2019

ఘోర ఓటమి తర్వాత, జగన్ సీఎం అయిన తర్వాత తీవ్ర ఆవేదనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు. పోలింగ్ ముగిసి కౌంటింగ్ మధ్య 40 రోజులు గ్యాప్ ఉన్నా.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అన్ని రాష్ట్రాలు వెళ్లారు. దీంతో బిజీ అయ్యారు. జగన్ మాత్రం ఫ్యామిలీ టూర్లు, సినిమాలు అంటూ రిలాక్స్ గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబుకి చాలా తీరిక దొరికింది. దీంతో ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారు.
లోకేష్ తో కలిసి సింగపూర్
కొడుకు, కోడలు, మనవడు, భార్యతో కలిసి చంద్రబాబు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వేసవి సెలవులను కొన్ని రోజులు అక్కడ గడపాలని నిర్ణయించారు. ఆ దేశం ఈ దేశం ఎందుకని సింగపూర్ ఎంచుకున్నారు. వారం రోజులు సింగపూర్, మలేషియా దేశాల్లో విహరించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బ్యాగులు సర్దిన ఫ్యామిలీ సభ్యులు.. మే 31వ తేదీ రాత్రి లేదా జూన్ 1వ తేదీన ఫ్లయిట్ ఎక్కనున్నారు. ఇన్నాళ్లు మనవడితో ఆడుకోవటానికి కూడా టైం లేదని చాలా బాధపడిన చంద్రబాబుగారు.. ఇప్పుడు తీరిగ్గా ఆడుకోవటానికి చాలా సమయం దొరికటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరంగా ఉన్నారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.