బ్యాంక్ ఏటీఎంలు హ్యాక్.. రూ.94 కోట్లు కొట్టేశారు

August 14, 2018

దేశవ్యాప్తంగా సైబర్ రెడ్ అలర్ట్..
పట్టపగలు దోపిడీ అంటే ఇదీ.. కంటికి కనిపించని టెక్నాలజీతో వైట్ కాలర్ దోపిడీ అంటే ఎలా ఉంటుందో చూపించారు.. దేశం కాని దేశంలో ఉండి.. అసలు ఏ దేశంలో ఉండి ఆపరేట్ చేశారో కూడా తెలియదు.. ఎవరు చేశారో కూడా తెలియదు.. కానీ మన దేశంలోని ఓ బ్యాంక్ నుంచి అక్షరాల 94 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర పూణెలోని కాస్మోస్ బ్యాంక్ ఉంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచీలు ఉన్నాయి. ఆగస్ట్ 11వ తేదీన ఫస్ట్ టైం హ్యాక్ జరిగింది. ఆ బ్యాంక్ ఏటీఎం మెషీన్స్ ను తన కంట్రోల్ లోకి తీసుకున్న హ్యాకర్లు.. గంపగుత్తగా ఒకేసారి 78 కోట్ల రూపాయలను దోపిడీ చేశారు. ఈ డబ్బు మొత్తం హాంగ్ కాంగ్ లోని పలు బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్లింది. దీంతో అలర్ట్ అయిన బ్యాంక్ సర్వర్లు, బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన..సైబర్ క్రైంకి కంప్లయింట్ చేసింది. ఈ విషయం వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడింది బ్యాంక్.
అప్పటికీ బ్యాంక్ అలర్ట్ కాలేదో.. హ్యాకర్లకు ఈ బ్యాంక్ సర్వర్ డీటెయిల్స్, మిగతా వివరాలు ఈజీగా అందుబాటులోకి వచ్చాయో ఏమోగానీ.. ఆగస్ట్ 13వ తేదీ రాత్రి మళ్లీ అటాక్ చేశారు. అక్షరాల 14 కోట్ల రూపాయలు మళ్లించారు. అదే విధంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అకౌంట్ల నుంచి కూడా 2.50 కోట్ల రూపాయలను హాంగ్ కాంగ్ లోని తమ అకౌంట్లకు మళ్లించారు హ్యాకర్లు. దీంతో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత్ ఐటీ విభాగం. రెండు రోజుల్లో ఓ బ్యాంక్ నుంచి 94 కోట్ల రూపాయలను కొట్టేసిన సైబర్ నేరగాళ్ల వేటలో పడింది భారత్ సైబర్ క్రైం డిపార్ట్ మెంట్..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.