బండ్ల గణేష్ గొంతుకోసుకుంటావా

December 11, 2018

తెలంగాణలో కారు జోరు దెబ్బకు కూటమి కుదేలు అయ్యింది. అడ్రస్ గల్లంతు అయ్యింది. భారీ ఓటమితో ఆ పార్టీ డీలా పడింది. కాంగ్రెస్, టీడీపీ నేతలు ముఖాలు చాటేశారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏందయ్యా అంటే బండ్ల గణేష్. తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తుందని.. రాకపోతే గొంతు కోసుకుంటా అంటూ సినిమా డైలాగ్స్ పేల్చాడు. ఇప్పుడు టీఆర్ఎస్ గెలించింది. కూటమి ఘోరంగా ఓడిపోయింది. ఫలితాల తర్వాత నెటిజన్లు బండ్ల గణేష్ ను కార్నర్ చేశాయి. బండ్ల ఎక్కడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బయటకు రండి.. గొంతు కోసుకుంటారా లేదా అని చురకలు అంటిస్తున్నాయి. మాటపై నిలబడటానికి, గొంతు కోసుకోవటానికి ఇంత కంటే మంచి సమయం లేదు మిత్రమా.. ఎక్కడ ఉన్నావ్.. బయటకు రా అంటూ పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం అజ్ణాతంలో ఉన్న బండ్ల.. ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.