స్మార్ట్ ఫోన్ ఫోబియా నుంచి ఎలా బయటపడాలి.. హ్యాపీగా ఎలా ఉండొచ్చు

August 22, 2018

ఆధునిక ప్రపంచం.. ఉరుకులు, పరుగులు. ఉదయం లేచింది మొదలు.. ఒకటే హడావిడి. ఇంట్లో టెన్షన్.. ట్రాఫిక్ లో టెన్షన్, ఆఫీస్ లో టెన్షన్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా టెన్షన్.. టెన్షన్. అవును ఒత్తిడి అనేది ఇప్పుడు పెద్ద రోగంగా మారింది. దీనికితోడు స్మార్ట్ ఫోన్. జీవితాన్నే మార్చేస్తోంది. దీని వల్ల నిద్ర లేటు అవుతుంది.. ఉదయం త్వరగా లేవలేకపోతున్నాం.. చివరకి అలారం కూడా స్మార్ట్ ఫోన్ లోనే.. ఎంత తింటున్నాం.. ఎన్ని క్యాలరీలు అనేది కూడా స్మార్ట్ ఫోన్ లోనే చూసుకుంటున్నాం. దీని నుంచి ఎలా బయటపడాలి.. ఒత్తిడిని ఎలా జయించాలి.. హ్యాపీగా ఎలా ఉండాలి అనే దానికి ఐదు చిట్కాలు పాటిద్దాం..

1.స్నేహితులు, బంధువులతో బయట రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు ఫోన్ తీసుకెళ్లొద్దు. ఒకవేళ ఫోన్ తీసుకెళ్లినా ఫోన్ బయటకు తీయొద్దు. ఫ్రెండ్స్, బంధువులతో మాట్లాడింది. ఫొటోలు తీసుకోవద్దు. టేబుల్ పై ఫుడ్ ఐటమ్స్ వాసన చూడండి.. ఆహారాన్ని ఆస్వాదించండి. అంతేగానీ ప్లేట్ లోని ఫుడ్ ను ఫొటో తీయటాలు, షేర్ చేయటాలు మానుకోండి. ఈ విధంగా కొద్దిసేపు అయినా స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండండి. హాయిగా కబుర్లు చెప్పండి.

2.స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత 72శాతం మంది బెడ్ పక్కన ఫోన్ పెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే అలారం అని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ లో అలారం మానేయండి. పాతకాలం కిర్రుకిర్రు అని తిప్పుకుని.. అలారం సెట్ పెట్టుకోండి. లివింగ్ రూంలోనే ఫోన్ వదిలేయండి.

3.ఫోన్ లోని అనవసరం అనుకున్న యాప్స్ ఉంటే డిలీట్ చేయండి. మీ మూడ్ కు తగినట్లు ఒకటి, రెండు యాప్స్ మాత్రం ఉంచుకోండి.

4.చేతిలో స్మార్ట్ ఫోన్, ఆఫీసుల్లో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో రోజులో ఎంత సమయం గడుపుతున్నారో గుర్తించండి. పైన చెప్పిన అంశాలు ఫాలో అయిన తర్వాత ఎంత సమయం సేవ్ అయ్యిందో గుర్తించండి. అప్పటికీ ఎక్కువ టైం ఎలక్ట్రానిక్ పరికరాలతో గడుపుతున్నారు అనుకుంటే.. ఎక్కడెక్కడ, ఏయే సమయాల్లో అనవసరంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నామో గుర్తించి.. ఆ టైంను తగ్గించుకోవటానికి ప్రయత్నించండి.

5.రోజు లేదా వారంలో పూర్తిగా ఎంత సమయం గాడ్జెట్స్ (స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు) దూరంగా ఉంటున్నామో.. ఆ టైం మొత్తాన్ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కు కేటాయించండి. ఒత్తిడి దూరం అవుతుంది. హ్యాపీగా ఉంటారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.