హైదరాబాద్ ఐటీ ఆఫీసుల్లో స్మార్ట్ ఫోన్లపై బ్యాన్

August 8, 2018

ఐటీ అంటే స్మార్ట్. ఐటీ ఉద్యోగి అంటేనే స్మార్ట్ ఫోన్ లేనిది.. ప్రపంచంతో కనెక్ట్ కాలేకుండా ఉండలేడు. ఓ చేతిలో కంప్యూటర్, మరో చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే నిద్ర కూడా పట్టదు. అలాంటి వారికి ఇప్పుడు కష్టకాలం వచ్చేసింది. ఆఫీస్ లో అడుగు పెట్టాలంటే స్మార్ట్ ఫోన్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు.. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు హైదరాబాద్ లోని చాలా ఐటీ కంపెనీలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్.. నాట్ అలౌడ్ అనే బోర్డ్ పెట్టేస్తున్నాయి. దీనికి కారణాలు బోలెడు ఉన్నాయి.

ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న టెకీలకు స్మార్ట్ ఫోన్ పిచ్చి బాగా ముదిరిపోయింది. వర్క్ చేస్తూనే చాట్ చేయటం, సెల్ఫీలు దిగటం, వీడియో కాల్ చేయటం కామన్ అయిపోయాయి. ఏ ఇద్దరు కనిపించినా కొత్త ఫోన్లు, అందులో ఆప్షన్స్ పైనే గుసగుసలు. వీకెండ్ పార్టీలు, హాలిడే టూర్లపై ఫొటోలు, వీడియోలను ఇతరులతో షేర్ చేసుకుంటూ ఆడోళ్ల కబుర్లను మించిపోతున్నారంట ఉద్యోగులు. వర్క్ ప్లేస్ లో కనీసం సగం టైం ఈ స్మార్ట్ ఫోన్లు మింగేస్తున్నాయని గుర్తించాయి యాజమాన్యాలు. దీంతో ప్రాజెక్ట్ టార్గెట్ డెడ్ లైన్ వరకు సరదాగా తీసుకుంటూ.. చివరి రోజుల్లో టెన్షన్ పడుతున్నారంట. దీనికి కారణం స్మార్ట్ ఫోన్ అని స్పష్టంగా గుర్తించేశారు. అందుకే చాలా ఐటీ కంపెనీలు స్మార్ట్ ఫోన్ బ్యాన్ చేశాయి.

ఎవరైనా ఆఫీసుకి స్మార్ట్ ఫోన్ తీసుకొస్తే.. దాన్ని భద్రపరుచుకునేందుకు లాకర్ల సదుపాయం కల్పించారు. అందులో పెట్టుకోవచ్చు. మరి ఎమర్జన్సీ అయితే ఇంట్లో వారు ఎలా కాంటాక్ట్ కావాలి అనే డౌట్ వచ్చిందా.. వస్తుంది. దీని కోసం ఐటీ బాబులు అందరూ కూడా ఇప్పుడు వెయ్యి, రెండు వేల రూపాయలు పెట్టి ప్యూచర్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. లాకర్ లో స్మార్ట్ ఫోన్ పెట్టేసి.. ప్యూచర్ ఫోన్ ను జేబులో పెట్టుకుని క్యాబిన్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఏం చేస్తాం.. పెరుగుట విరుగుట కొరకే అన్నారు.. కాలం అంటే ఇదే.. ప్యూచర్ ఫోన్ వాడే వ్యక్తులనే చీప్ గా చూసిన ఐటీ దొరబాబులకు ఇప్పుడు అదే ప్యూచర్ ఫోన్ అవసరం అయ్యింది..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.