సీపీఎస్‌ సర్వే సంస్థ నిబద్ధత తెలుసా ఉత్తమ్‌.. ట్రాక్‌ రికార్డ్‌ ఒక్కసారి చూడు..!!

December 4, 2018

తెలంగాణ ఎన్నికలపై సీపీఎస్‌ సంస్థ నిర్వహించిన తాజా సర్వే రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.. మరోసారి అధికారం టీఆర్‌ఎస్‌దే అని సీపీఎస్‌ సంస్థ తేల్చిపారేసింది. గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెబుతున్నట్లు ఆ పార్టీ స్వీప్‌ చేసే విధంగానే ఫలితాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌కి ఏకంగా 94-104 స్థానాలు దక్కుతాయని, అదే ప్రజా కూటమికి కేవలం 16-21 నియోజకవర్గాలలోనే పట్టు దక్కుతుందని తేల్చిపారేసింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు నిద్ర పట్టనీయకుండా మారింది.

సీపీఎస్‌ సంస్థ సర్వేపై లైవ్‌లోనే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన ఆగ్రహం, ఆక్రోశం, ఆవేశం వెళ్లగక్కారు. ఇదంతా ఫేక్‌ సర్వే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సీపీఎస్‌ సంస్థ క్రెడిబులిటీ ఏంటో తెలుసుకోవాలని, దానిని ఆ సంస్థ నిర్వాహకుడు వేణుగోపాల్‌ వివరిస్తారని యాంకర్‌ చెబుతున్నా దానిని పట్టించుకునే స్థాయిలో లేడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

ఎన్నికల విశ్లేషణలో సీపీఎస్‌ సంస్థకు చాలా క్రెడిబులిటీ ఉంది. 2009లో ఎందరో తలపండిన రాజకీయ విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్టులకు సైతం అర్ధం కాని పల్స్‌ని పక్కాగా పట్టేసింది ఈ సంస్థ. మేజిక్‌ ఫిగర్‌కి నాలుగు సీట్లతో బొటాబొటీగా బయటపడుతుందని తెలిపింది. అది నిజమయింది. సీపీఎస్‌ సంస్థ మినహా మరే ఇతర సంస్థలు ఈ నాడిని పసిగట్టలేకపోయాయి. ఆ తర‌వాత రెండేళ్ల క్రితం జరిగిన జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ స్వీప్‌ చేస్తుందని, మొత్తం 150కార్పొరేషన్‌లలో కారు గుర్తుకు 95-100 స్థానాలు దక్కడం ఖాయమని, కారు జోరుకు ఎవరయినా అడ్డువస్తే యాక్సిడెంట్‌ తప్పదని తేల్చిపారేసింది..

ఇదీ తమ సంస్థ క్రెడిబులిటీ…. గత కొన్నాళ్లుగా తాము చెప్పింది తప్పు కాలేదని, ముందు దానిని నమ్మాలని సీపీఎస్‌ సంస్థ నిర్వాహకుడు వేణుగోపాల్‌ చెబుతున్నా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అవేవీ పట్టించుకోకుండా తన ఆవేదనలో, తన అసహనంలో తాను మునిగిపోయారు. గతంలో వైఎస్‌ రెండో సారి అధికారంలోకి వస్తారని తాము చెప్పినప్పుడు ఏం చేశారని, అది నిజమయింది కదా అని నిలదీశారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.