సత్తా ఉన్నోళ్లకే అప్పులిస్తారు..! వాళ్లకు ఎవరైనా చెప్పండ్రా..!?

December 4, 2018

తెలంగాణ అప్పుల గురించి.. రాజకీయ పార్టీలు చిత్ర విచిత్రమైన వాదనలు వినిపిస్తూ ఉంటాయి. అందులో ఒక్కటీ నిజం ఉండదు. అబద్దాలు చెబుతూఉంటారు. పరిమితికి మించి అప్పులు చేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. నిజానికి అప్పులకు ఓ పరిమితి ఉంటుంది. దాన్ని ఎఫ్ ఆర్ బీ ఎం అంటారు. ఆ చట్టం ప్రకారం అప్పులు తీసుకుంటారు. తెలంగాణ కూడా అందే. ఆ చట్టం ప్రకారం… రాష్ట్ర ఆస్తులను చూసి.. అప్పుల శాతాన్ని నిర్ణయిస్తారు. సొంత రాబడులను ఎప్పటికప్పుడు పెంచుకొంటూ ఆర్థికంగా గణనీయమైన ప్రగతి సాధిస్తున్న రాష్ట్రం తెలంగాణ. అందుకే కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచింది.

ఎఫ్‌ఆర్‌బీఎం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్. ఈ పరిమితిని 3 నుంచి 3.5కు పెంచుతూ కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న స్థిరమైన ఆర్థిక వృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ పరిమితితో రూ.25,019 కోట్ల వరకు బ్యాంకుల నుంచి నామమాత్రపు వడ్డీకి రుణం తీసుకొనే అవకాశం తెలంగాణ ఉంది. ఆ అప్పులు మాత్రమే తెలంగాణ తీసుకుంది. అంతకు మించి అప్పులు ఎవరూ ఇవ్వరు. తెలంగాణ ప్రభుత్వం కూడా.. తీసుకోలేదు. దేశంలో పెరిగిపోతున్న బడ్జెట్‌లోటు, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యాన్ని అదుపులో పెట్టడానికి కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్‌ను తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం లోటు బడ్జెట్ ఉన్న రాష్ర్టాలకు రిజర్వ్‌బ్యాంకు నుంచి రుణాలపై ఆంక్షలు విధించింది. మొత్తం జీఎస్డీపీలో మూడుశాతం కంటే ఎక్కువ రుణాలు తీసుకోకుండా పరిమితి విధించింది. మొత్తం రెవెన్యూ ఆదాయంలో వడ్డీలు 10 శాతం మించకుండా ఉండటం, రాష్ట్ర స్థూలఉత్పత్తి లో అప్పులు 25 శాతం దాటకుండా ఉండటం.. సరైన రెవెన్యూ మిగులు ఉన్న రాష్ర్టాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుతారు. జాతీయ సగటు వృద్ధిరేటు కంటే ఏటా 17 నుంచి 21 శాతం వరకు ఆర్థిక వృద్ధిరేటు సాధిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉన్నది. జాతీయస్థాయిలో పౌరుల సగటు తలసరి ఆదాయం ఏడాదికి రూ.93,231 ఉండగా, తెలంగాణలో రూ.1,43,0 23గా ఉన్నది.

అందుకే.. ధనిక రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. ఈ సామర్థ్యం మేరకే అప్పులిస్తున్నారు. లక్షలు కోట్లు చేసినట్లు విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో అసలు నిజం లేదు. అవన్నీ పాత రాష్ట్రం నుంచి.. వారసత్వంగా వచ్చిన అప్పులు. వాటిని తీరుస్తూ.. తెలంగాణ ముందుకెళ్తోంది. ఈ విషయం తెలియక.. విపక్షాలు రచ్చ చేస్తున్నాయి. ప్రజల్ని మోసం చేస్తున్నాయి.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.