వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్, పార్టీ సీనియర్లతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ బృదం సమావేశం అనంతరం.. శ్రీ జగన్ తో కలిసి శ్రీ కేటిఆర్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

January 16, 2019

1) గౌరవనీయులు టిఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసిఆర్ గడిచిన ఏడాదిన్నరగా దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చేందుకు.. కేంద్రం అధికారాలను తన వద్ద పెట్టుకొని రాష్ట్రాలను ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమాఖ్య స్ఫూర్తితో ఫెడరల్ ఫ్రంట్ పోరాటాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆయా పార్టీల అధ్యక్షులతో సంప్రదింపులు జరిపి.. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
2) గౌరవనీయులు, పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ గారికి నిన్న ఫోన్ చేసి.. మాట్లాడేందుకు వస్తాం అని కోరాం. ఆయన రమ్మన్నారు.
3) తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. లైక్ మైండెడ్ పీపుల్..కలిసి.. రాష్ట్రాలను శక్తివంతం చేయడానికి భవిష్యత్తులో సందర్భానుసారంగా .. రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ముందుకు వెళతాం.
4) ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేసిఆర్ స్వయంగా వెళ్ళి.. జగన్ గారుతో చర్చించిన తర్వాత.. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకుపోతాం.
5) ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మా వైఖరిని టిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో సహా.. రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు, లోక్ సభలో కవిత.. పలు సందర్భాల్లో స్పష్టం చేశాం. అప్పటి ప్రధాని లోక్ సభలో ఇచ్చిన మాట నిలబెట్టాలని మేం చెప్పాం.
6) ఈరోజు జరిగింది కేవలం మొదటి సమావేశం మాత్రమే. మిగతా అంశాలన్నింటినీ.. కేసిఆర్ జగన్ గారితో కలిసిన తర్వాత కూలంకుషంగా చర్చించి మాట్లాడతారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలపై ఉమ్మడిగా ఏ విధంగా పోరాడాలనే అంశాలపై చర్చిస్తారు.

జగన్ గారు మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
————-
1) కేసిఆర్ గారు ఫోన్ లో మాట్లాడిన పిమ్మట.. తారక్(కేటిఆర్)ఈరోజు వచ్చి చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్.. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి.. చర్చించాం.
2) రాష్ట్రాలు అన్యాయానికి గురికాకుండా.. కేంద్రాన్ని నిలదీసేందుకు రాష్ట్రాలు ఒక వేదికమీదకు రావాలి. లేకుంటే రాష్ట్రాల హక్కులు సాధించలేం.
3) ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చేసిన హామీకే దిక్కూ దివానం లేదు.
4)ఈ పరిస్థితిని అధిగమించాలంటే.. రాష్ట్రాల పరిధిలో.. ఎంపీల సంఖ్యాపరంగా చూస్తే.. దానిని అధిగమించే పరిస్థితి ఉండదు. కాబట్టి, మన రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలకు తోడు.. పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు జత అయితే.. మొత్తం 42 మంది రాష్ట్రానికి జరుతున్న అన్యాయంపై ప్రశ్నించగలిగితే.. పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాట అని చెప్పగలిగితే.. కేంద్రం దిగి వస్తుంది.
5) ఇది స్వాగతించదగిన విషయం. రాష్ట్రాల హక్కులు కాపాడబడాలంటే.. సంఖ్యాపరంగా ఈ నెంబర్ పెరగాలి.
6) రాష్ట్రాల బలం పెరిగితే.. అప్పుడు రాష్ట్రాలకు అన్యాయం చేసేవిధంగా కేంద్రం నడుచుకోవటానికి వెనకడుగు వేస్తోంది.
7) కేసిఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఒక జాతీయ ప్లాట్ ఫాం ఏర్పాటు చేశారు. ఎంపీల పరంగా ఏకం చేసి.. రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ముందుకు వెళ్ళటం.. అది హర్షించదగిన విషయం..
8) కేసిఆర్ గారు ఫోన్ లో మాట్లాడారు. ఈ అంశంపై మరోసారి చర్చలకు కేసిఆర్ వస్తానన్నారు. కేసిఆర్ చెప్పిన అంశాలను పార్టీలో సుదీర్ఘంగా చర్చించి.. రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకువెళ్ళే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తాం..
9) రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల సంఖ్యాబలం పెరగాలి. అప్పుడే రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి రావాలి.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.