లోకేష్ ఆలోచన.. టీడీపీ పిలుపు : మోడీ ఇచ్చే రూ.6వేలు రైతులు తీసుకోవద్దు

February 2, 2019

ఏపీ టీడీపీ మరో షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నది. మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు ఉద్యమం తీసుకొస్తున్నారు. ఆయన ఎడ్డెం అంటే.. బాబుగారు ముందూ వెనకా ఆలోచించకుండా తెడ్డెం అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్ల తర్వాత యూటర్న్ తీసుకుని చేస్తున్న ఉద్యమంలో మరో కీలక ప్రకటన చేయటానికి రెడీ అయ్యారంట.
మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు ఇవ్వబోతున్న రూ.6వేల రూపాయలను ఏపీ రైతులు తిరస్కరించాలని పిలుపు ఇవ్వబోతున్నారంట. దీనిపై ఇప్పటికే లోకేష్ తో చర్చించిన చంద్రబాబు.. కుమారుడి ఆలోచనకు ఫిదా అయ్యారంట. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ కాబోతున్నాయి. ఈ డబ్బు కోసం ఏపీ రైతులు ఎవరూ ఎగబడొద్దని.. ఒకవేళ్ల 2వేలు జమ అయితే తిరిగి మోడీకే పంపించాలని లోకేష్ ఆలోచనగా.. ఏపీ రైతులకు తెలుగుదేశం పార్టీ పిలుపు ఇవ్వబోతున్నది. ఈ విషయంపై ఇప్పటికే బాగా కసరత్తు చేసిన టీడీపీ పార్టీ.. ఆ దిశగా ఎల్లో మీడియా ద్వారా కలర్ కోటింగ్ వార్తలతో భారీ ఎత్తున ప్రచారం చేయటానికి సన్నద్ధం అయిపోయింది.
కలర్ మీడియా.. ఎల్లో కోటింగ్ ద్వారా ఈ వార్తలను బాగా రాసి.. రైతుల నోట్లో మట్టి కట్టటానికి కూడా రెడీ అయిపోయిందని ఏపీ రాష్ట్రంలో తెగ చర్చ జరుగుతుంది. బడ్జెట్ వచ్చి 24 గంటలు అయ్యింది.. మోడీపై ఇంకా మనం సైలెంట్ గా ఉంటే ఎలా అంటూ టీడీపీ నేతలు రగిలిపోతున్నారంట. మనకు అయితే కచ్చితంగా ఈ డబ్బు రాదు కదా.. నాశనం అయితే రైతులే కదా అంటూ కొంత మంది టీడీపీ నేతలు సైతం వెటకారాలతో కామెంట్స్ చేయటం సంచలనంగా మారిందని.. ఏపీలో హాట్ డిస్కషన్ అయ్యింది. చూడాలి లోకేష్ ఆలోచనకు.. టీడీపీ నుంచి చంద్రబాబుగారు ఎలాంటి పిలుపు ఇస్తారో…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.