లీటర్ పెట్రోల్ రూ.100 అయితే ఏంటీ.. మొద్దుబారిపోయిన జనం బుర్రలు

July 18, 2018

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయ్.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు అంటూ రోజువారీ ధరల మాదిరిగానే.. వాహనదారులు కూడా ఫీల్ అవుతున్నారా.. అసలు ధర ఎంత పెరుగుతుంది.. ఎంత భారం పడుతుంది అనే ఆలోచిస్తున్నారా.. వాస్తవంగా అయితే అలాంటి పరిస్థితి అస్సలు లేదంట. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై పెద్దగా ఎవరూ కూడా ఆలోచించకపోగా.. పట్టించుకోవటమే మానేశారంట. ఇదే విషయంపై తుగ్లక్ టైమ్స్ గ్రౌండ్ వర్క్ చేసింది. ఎవరూ ఊహించని సమాధానం వాహనదారుల నుంచి వచ్చింది. వారి ఓపీనియన్ ఎలా ఉందో చూద్దాం..

[tuglakchoice]పెట్రోల్ రేటు ఎంత అంటే.. ఏమో తెలియదు. రోజూ పెరుగుతుంది అని చెబుతున్నారు. ఉన్న సమస్యలకు ఇది ఏం గుర్తు పెట్టుకుంటాం.. రూ.100 నోటు ఇస్తున్నాం.. కొట్టించుకుంటున్నాం.. అయిపోగానే మళ్లీ 100కి కొట్టించుకుంటున్నాం.. పెట్రోల్ రేటు ఎంత పెరిగిందో.. పెరుగుతుందో అర్థం కావటం లేదు. – నవీన్ కుమార్, ICICI బ్యాంక్ ఉద్యోగి

లీటర్ పెట్రోల్ రూ.100 అవుతుంది అంట కదా.. మన చేతుల్లో ఏం ఉంది. 100 అయినా..200 అయినా బండి తీయక తప్పదు.. పెట్రోల్ బంకుకి రాక తప్పదు. లీటర్ కొట్టించుకోవటం ఎప్పుడో మానేశాం.. ఇప్పుడు 100, 200, 300 రూపాయలకు కొట్టించుకుంటున్నాం. అలవాటు అయిపోయింది. రోజూ మారే ధరలు తెలుసుకోవటం వల్ల.. పెట్రోల్ బంకుకి రాకుండా పోతామా ఏంటీ.. తప్పదు – రాఘవరావు, ఐటీ ఉద్యోగి

డీజిల్ రేట్లు బాగా పెరగటం వల్ల ఇబ్బందిగా ఉంది. రోజూ మా ఆటో రేట్లు మార్చలేం కదా. ఇప్పటికే మినిమమ్ ఛార్జీని రూ.10 చేశాం. నాలుగు రోజుల్లోనే రూ.2 డీజిల్ పెరిగిందంట.. మేం కూడా రూ.2 పెంచాం. ఎంత పెరిగే అంత ఆటో ఎక్కే వాళ్లపైనే కదా వేసేది. మా చేతుల్లో ఏమీ లేదు. జనమే కదా బరించేది.. వాళ్లకి లేనిది మాకు ఎందుకు బాధ – హుస్సేన్, ఆటోవాలా

ఇందన ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారు అనేది బహిరంగంగా వెల్లడి కాకపోయినా.. కసి మాత్రం ఉంది. రెండు, మూడేళ్లుగా వాహనదారులు లీటర్ చొప్పున పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవటం బాగా బాగా తగ్గిపోయింది. వందలు, వేల చొప్పున కొట్టించుకోవటం బాగా అలవాటు పడ్డారు. బైక్స్, కార్లు, ఆటోలు, లారీలు, బస్సులు ఇలా అందరూ కూడా 500, వెయ్యి, రెండు వేలు ఇలా కొట్టించుకుంటూ ఉండటం వల్ల.. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆగ్రహాలు, నిరసనలు పెద్దగా వ్యక్తం కాకపోవటం విశేషం. జనం బుర్రలు కూడా మొద్దుబారిపోయాయి.. తుగ్లక్ టైం గ్రౌండ్ రిపోర్ట్ ఇదే..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.