రియాల్టీ బాహుబలి హైదరాబాద్ : గ్లోబల్ ర్యాంక్ వన్

July 19, 2018

దేశం చూపే గొప్పగా చెప్పుకునే రోజుల నుంచి ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుంది అని చెప్పుకునే రోజులు వచ్చేశాయి. రియాల్టీలో భారతదేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎదుగుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్ ప్లేస్ వచ్చింది. తర్వాత స్థానం బెంగళూరుది. నాలుగో స్థానంలో పూణె, 5వ ప్లేస్ లో కోల్ కతా ఉండగా.. 8వ స్థానంలో ఢిల్లీ నిలిచింది.
హైదరాబాద్ గురించి కాంపౌండ్, అనరాగ్ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ ఇలా ఉంది

  • రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ వాల్డ్ బెస్ట్ సిటీ. 2008లో 23 మిలియన్ ఆఫీస్ స్క్వైర్ ఫీట్ ఉంటే..2017 నాటికి 56 మిలియన్ ఆఫీస్ స్క్వైర్ ఫీట్ వినియోగంలో ఉంది. ప్రపంచంలో ఏ సిటీలోనూ ఇంత పెద్ద ఎత్తున ఆఫీస్ స్థల వినియోగం పెరగలేదు. ఒక్క హైదరాబాద్ లోనే గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది.
  • గృహాలు, స్థలాల కొనుగోళ్లలో ఊహించని అభివృద్ధి సాధించింది హైదరాబాద్. 2013 – 2017 మధ్య నాలుగేళ్ల కాలంలోనే 32శాతం గృహాల కోసం ఇల్లు, అపార్ట్ మెంట్లు, స్థలాలు కొనుగోలు చేశారు.
  • ప్రాపర్టీ సేల్స్ గ్రోత్ లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా గ్లోబల్ ర్యాంక్ సాధించింది. ఇండియాలోని ప్రధాన నగరాలతో పోల్చి చూస్తే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ప్రతి ఏటా 6 నుంచి 8శాతం ఆస్తుల విలువ పెరుగుతుంది.
  • దేశంలోనే నివాస యోగ్యం అయిన నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. ఇది కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు కారణం అవుతుంది.
  • ఇతర రాష్ట్రాలు, దేశాలకు కనెక్టెవిటీలోనూ టాప్ ప్లేస్ హైదరాబాద్ అని అనరాగ్ సంస్థ చెబుతోంది. అంతర్జాతీయ విమాశ్రయంతోపాటు జాతీయ రహదారులు అందుబాటులో ఉన్నాయి.
  • అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందుబాటులో ఉండటంతో గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ కంపెనీల్లోని ఉద్యోగులు హైదరాబాద్ వైపు చూడటానికి ప్రధాన కారణంగా కాంపౌండ్ డెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సంస్థ వెల్లడించింది.
  • వ్యాపార అవకాశాలతోపాటు క్వాలిటీ మేన్ పవర్ లభించటం హైదరాబాద్ కు ఉన్న మరో అద్భుత అవకాశంగా వెల్లడించింది సంస్థ
  • మౌలిక వసతుల కల్పనతోపాటు అంతర్జాతీయ బ్రాండ్లు అన్నీ కూడా సరసమైన ధరల్లో దొరకటం, ఎంటర్ టైన్ మెంట్ అంశాల్లోనూ ముందుండటం (మాల్స్, ఎమ్యూజ్ మెంట్ పార్కులు) కలిసి వచ్చే అంశంగా అనరాగ్ సంస్థ రిపోర్ట్ చెబుతోంది.
  • ప్రపంచం మొత్తానికి ఐటీ హబ్ కేంద్రంగా ఉంది హైదరాబాద్. ఐటీ ఉద్యోగ కల్పనలో రెండో స్థానంలో ఉండటంతో దేశంలోని యువత చూపు ఇటువైపే ఉంటుంది.

అన్ని రకాలుగానూ నివాస యోగ్యత, వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ ఉండటంతోనే రియాల్టీ బాహుబలిగా కీర్తిస్తోంది ప్రపంచం. పెట్టుబడులు, సంపద సృష్టిలో ప్రపంచంలోని టాప్ 30, దేశంలోని టాప్ 10 గ్లోబల్ సిటీస్ లో హైదరాబాద్ నెంబర్ వన్ గా ఉన్నట్లు 2018 సిటీ మెమొంటం ఇండెక్స్ చెబుతోంది అక్షర సత్యం ఇది.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.