రాజకీయాల్లోకి అక్కినేని అమల : గుంటూరు నుంచి పోటీ

January 3, 2019


అక్కినేల అమల రాజకీయం తెరంగేట్రం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. జగన్ పాదయాత్ర ముగింపు తర్వాత పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా చర్చలు పూర్తయ్యాయి. అక్కినేని నాగార్జున రాజకీయాల్లోకి రావాలని ఆలోచించినా.. సినీ ఇండస్ట్రీ, కొడుకుల జీవితాన్ని తీర్చిదిద్ది పనిలో బిజీగా ఉన్నారు. దీంతో భార్య అమలను ప్రోత్సహించారు. సామాజిక కార్యకర్తగా, వివాదరహితంగా, అందరితో కలుపుగోలుగా వ్యవహరించే అమల అయితేనే బెటర్ అనే అభిప్రాయంతోనే అక్కినేని ఫ్యామిటీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న అమల.. లోక్ సభ బరిలో పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయించాలని జగన్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గుంటూరు లోక్ సభ అయితేనే బెటర్ అని.. అక్కడ పోటీ చేస్తే అమల గెలుపు ఖాయం అని పార్టీ సర్వేల్లో కూడా తేలిందంట. గుంటూరు లోక్ సభ నుంచి ప్రస్తుతం టీడీపీ నుంచి గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు టీడీపీ సర్వేల్లోనూ వచ్చింది. స్థానికంగా అందుబాటులో ఉండకపోవటం, అప్పుడప్పుడూ వస్తుండటం, పార్టీ నిర్మాణం, కార్యక్రమాల్లోనూ కనిపించకపోవటంతో నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని ఆలోచిస్తున్నారు జగన్
సామాజికవర్గం – సినీ గ్లామర్ :
అమల లోక్ సభ బరిలోకి దిగితే కమ్మ సామాజిక వర్గం నుంచి సపోర్ట్ దొరకనుంది. అక్కినేని నాగార్జున స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఆయన సుపుత్రులు నాగచైతన్య, అఖిల్ తోపాటు రామానాయుడు ఫ్యామిలీ నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో కమ్మ సామాజిక వర్గం ఓట్లు మొత్తం కాకపోయినా.. చీల్చటం అయితే గ్యారంటీ. దీనికితోడు సినీ గ్లామర్ కూడా బాగా కలిసిరానుంది. నాగార్జున స్వయంగా ప్రచారంలోకి వస్తే యూత్ ఓట్లను తనవైపు తిప్పుకోవటం ఈజీ. ఈ సమీకరణాలన్నింటినీ అంచనా వేసి అక్కినేని అమలను గుంటూరు లోక్ సభ బరి నుంచి పోటీకి దింపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఆలోచిస్తున్నారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.