మీడియాను ఎర్రిపప్పలు, బకరా చేసిన పోలీసులు

February 5, 2019

చిగురుపాటి జయరాం హత్యలో మీడియా ఎర్రిపప్ప అయ్యింది. పోలీసులు ఆడిన గేమ్ లో బకరా అయ్యారు. లీకులు ఇస్తూ అసలు విషయాన్ని డైవర్ట్ చేశారు. మీడియాను వాడుకోవటం మాకూ తెలుసు అంటూ సగర్వంగా నిరూపించింది పోలీస్ శాఖ. ఏపీ, తెలంగాణ పోలీసులు ఆడిన ఆటలో మీడియా ఎర్రిపప్పలుగా మిగిలి.. నవ్వులపాలు కావటం విశేషం. మీడియా ఎందుకు బకరా అయ్యిందో చూద్దాం..

 • కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్, ఎక్స్ ప్రెస్ టీవీ ఎండీ, పారిశ్రామికవేత్త అయిన చిగురుపాటి జయరాం చనిపోయిన 24 గంటల వరకు మీడియాకు సమాచారం లేదు. ముందుగా తెలిసింది తెలంగాణ పోలీసులకే. ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులకు హంతకుడు రాకేష్ ఫోన్ చేశాడు. శవాన్ని ఎలా మాయం చేయాలి.. యాక్సిడెంట్ గా ఎలా చిత్రీకరించాలి అనేది అడిగి మరీ తెలుసుకున్నాడు.
 • అంటే హత్య గురించి ఏసీపీ స్థాయి అధికారికి సమాచారం వచ్చినా.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసే హంతకుడితో లాలూచీపడి కేసును డైవర్ట్ చేశారు.
 • హంతకుడు రాకేష్ ఫొటో ఇదే అంటూ.. రెండు రోజులు ఆ ఫొటో అన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లు చూపించాయి. ఓ హంతకుడి ఫొటో తప్పుగా వస్తున్నా.. తెలుగు రాష్ట్రాల పోలీసులు సినిమా చూసినట్లు చూశారు. తప్పు అని మీడియా చెప్పలేదు. అంటే కేసును తప్పుదోవ పట్టించారనేది స్పష్టంగా అర్థం అవుతుంది కదా..
 • శిఖాచౌదరిని 4 రోజులు విచారించారు. కేసుతో సంబంధం లేకపోతే ఇన్ని రోజులు ఎలా విచారించారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.
 • శిఖాచౌదరి – చిగురుపాటి జయరాం – రాకేష్ రెడ్డి – శ్రీకాంత్ మధ్య వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే వార్తలు వచ్చినా.. కృష్ణా జిల్లా ఎస్పీ మాత్రం అలాంటిది ఏమీ లేదని తేల్చేశారు. ఆమెను కనీసం నిందితుల జాబితాలో కూడా చేర్చలేదు. ఎందుకు ఇలా జరిగింది.
 • శిఖా చౌదరి ద్వారానే రాకేష్ – జయరాం మధ్య పరిచయం. అయినా శిఖా చౌదరి హ్యాపీగా స్టేషన్ నుంచి వెళ్లిపోయింది. ఎవరికీ కనిపించకుండా తరలించారు. ఆమె కారును విచారణ కంటే ముందే ఇచ్చేశారు. ఏ స్థాయిలో వత్తిళ్లు వస్తున్నాయో అనేది ప్రశ్నకు సమాధానం లేదు.
 • హైదరాబాద్ లో హత్య చేసి విజయవాడ ఐతవరం తరలించారు డెడ్ బాడీ. శవాన్ని ఓ కారులో తరలించారు. వెనక మరో కారులో రాకేష్ ఫాలో అయ్యాడు అని వార్తలు వచ్చాయి. శవం డ్రైవింగ్ చేయదు. మరి ఆ కారును నడిపింది ఎవరు అనే దానికి సమాధానం లేదు. వెనక కారులో రాకేష్ ఒక్కడే ఉన్నాడా అంటే దానికీ సమాధానం లేదు. మీడియాలో వచ్చిన కథనాలను పోలీసులు ఖండించనూ లేదు.. ప్రెస్ మీట్ పెట్టి నిజం అని కూడా చెప్పలేదు. ఇంతకీ ఏది నిజం.
 • 24 గంటలు జయరాంను నిర్బంధించి కొట్టారు అని చెబుతున్నారు. వాచ్ మెన్ ఒక్కడే ఉన్నాడు అంటున్నారు. మరి దస్మల్లా హాటల్ నుంచి 6 లక్షలు తీసుకొచ్చింది ఎవరు.. ఆ డబ్బును రాకేష్ కు ఇచ్చింది ఎవరు.. 24 గంటలు ఓ వ్యక్తి నిర్బంధించి కొట్టాడు అంటే ఒక్కడే ఎలా ఉంటాడు.. సాధ్యమయ్యే పనేనా అనేది కూడా ప్రశ్న. దీనికి పోలీసులు సమాధానం చెప్పటం లేదు.
 • నాలుగు రోజులు విచారణ చేసి.. విచారణ ఇంకా కొనసాగుతుంది అంటున్నారు. అలాంటప్పుడు ఎసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులను ఎందుకు బదిలీ చేశారు. వారిని ఎందుకు ప్రశ్నించటం లేదు. ఎందుకు అదుపులోకి తీసుకోవటం లేదు. చిగురుపాటి హత్య కేసులో పోలీసుల పాత్ర అస్సలు లేదని వారిని ప్రశ్నించకుండానే ఎలా ప్రకటిస్తారు. తెలుగు రాష్ట్రాల పోలీసుల వ్యవహారశైలిపై ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయ్యింది.
 • మొత్తంగా మీడియా బకరా అయ్యింది. 4 రోజులు వండివార్చిన కథనాలు అన్నీ కూడా తూచ్ అని చెప్పి.. ఎర్రిపప్పలను చేశారు పోలీసులు.
 • ఆకలి కడుపు కోసం వ్యభిచారం చేసే ఆడోళ్ల ఫొటోలు, వీడియోలు చూపించటం తప్పని తెలిసి కూడా ఎగబడి తీసుకునే మీడియా ఉన్నంతకాలం పోలీసుల ఎదుట ఎర్రిపప్పలుగానే ఉంటారు. ఆడోళ్లు అనే జ్ణానం కూడా లేకుండా వాళ్ల ముఖాల బలవంతంగా చూపించే పోలీసులను ప్రశ్నించలేని మీడియా ఉన్నంత కాలం.. పోలీసులు ఇలాగే బకరాలను చేస్తుంటారు. ఏదో దేశద్రోహం, హత్యలు, మానబంగాలు చేసినట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినోళ్ల ఫొటోలను ప్రచురించే పత్రికలు, టీవీలు ఉన్నంతకాలం పోలీసుల వైఖరి ఇలాగే ఉంటాయి. ఇప్పటికైనా మారండిరా బాబూ.. ఎన్నాళ్లు… మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాం….

ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.