మనకు మనమే మోసం చేసుకుంటామా? – ఎవరు ద్రోహి.. ఎందుకు ద్రోహులు

July 19, 2018

ఎవరి వాదనలు వారికి ఉండొచ్చు.. వాటిని స్వేచ్ఛగా చెప్పగలిగినప్పుడే ప్రజాస్వామ్యం బతికి ఉన్నట్లు. అదే లేకపోతే ఎలా.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలది చిత్రమైన వాదన ప్రజలను ఆలోచింపజేస్తోంది. తెలంగాణ రాష్ట్రం కావాలని అందరూ ఆకాంక్షించారు. ఏపీ ప్రజలు కూడా తెలంగాణ ఇవ్వండి ముక్తకంఠంతో కోరారు. అన్ని పార్టీలు అంగీకరించాయి.. కాకపోతే సాధనలో వాదనలు భిన్నంగా ఉన్నాయి. ఉంటాయి కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అలాగే జరుగుతుంది. ఇప్పుడే చిత్రంగా తెలంగాణ ద్రోహులు అంటూ కొత్త వాదన పుట్టుకొచ్చింది.

తెలంగాణ ద్రోహి, ద్రోహులు అంటూ అంటున్నారు.. ఎవరు ఎవర్ని అంటున్నాం.. తెలంగాణ సమాజంలోనే పుట్టి, పెరిగిన వాళ్లను కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం ద్రోహులు అంటే.. మిగతా వాళ్లు ఎలా చూస్తారు.. ఎలా ఆలోచిస్తారనే ఆలోచన లేకపోవటం విడ్డూరం. వాదనలు – చర్చ అనేది ఎప్పుడూ ఉంటుంది కదా అని మిగతా వాళ్లు వేలెత్తి చూపించే విధంగా ఉండటం ఇక్కడ విశేషం. మనోళ్లను మనమే ద్రోహులుగా ముద్ర వేసుకుంటే.. మిగతా రాష్ట్రాల్లో ఎంత అలుసు అయిపోతాం. ప్రతిక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. రాష్ట్రం ఆకాంక్షలు, అభివృద్ధిని ఫణంగా పెట్టకూడదు.. 60 ఏళ్ల స్వప్నం సాకారం అయినప్పుడు అందర్నీ కలుపుకుని పోవాలి. ఉమ్మడి కుటుంబం అన్నాక వంద సమస్యలు ఉంటాయి.. అలా అని మన కుటుంబ సభ్యులనే దొంగ, ద్రోహి అంటే చుట్టుపక్కల వాళ్లు మొత్తం కుటుంబంపైనే అభాండాలు వేసే ప్రమాదం లేదా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం కూడా అలాగే ఉంది. అధికారంలోకి రావాలనుకోవటంలో తప్పులేదు.. అది ప్రజలు నిర్ణయిస్తారు.. అలా కాకుండా కొత్త రాష్ట్రంలో ద్రోహులు, కుట్రదారులు అంటూ అభివృద్ధిని తొక్కిపెట్టి.. విషపు బీజాలు నాటాలి అనుకోవటాన్ని ప్రశ్నలు గమనిస్తూనే ఉంటారు.. కాళేశ్వరం సాక్షిగా సమాధానం చెప్పక తప్పదు కదా..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.