బాబు బీహార్ అంటే.. రవిప్రకాష్ గలీజ్ ఆంధ్ర అంటున్నాడు..

October 26, 2019

సీఎం జగన్ పై విషప్రచారం
ఆంద్రోళ్లు గలీజోళ్లా.. ఆంధ్రరాష్ట్రం అంటే గలీజుదా.. ఎంత బరితెగింపు.. ఎంత దుర్మార్గం.. ఎంత అహంకారం.. ఎంత బలుపు.. జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన వెంటనే రవిప్రకాష్ తన వెబ్ సైట్ ద్వారా చేస్తున్న విష ప్రచారానికి ఇది పరాకాష్ఠ. గలీజు ఆంధ్ర అంటూ ఏకంగా హెడ్డింగ్ పెట్టి ఏపీలో సీఎం జగన్ పరిపాలనపై తన అక్కసు వెళ్లగక్కాడు. అత్తపై కోపం దుత్తపై చూపించినట్లు.. ఏదో వెబ్ సైట్ ఏదో వార్త రాసిందని.. దానిపై చూపించాల్సిన అక్కసును అంతా ఏపీ రాష్ట్రంపై చూపించాడు. ఏపీలో టీడీపీకి, చంద్రబాబుకి అంటగాగిన ఈయన తన జీవితం మొత్తం వైఎస్ కుటుంబానికి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన దుష్ప్రచారాన్ని చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆంధ్ర రాష్ట్రంపైనే తన పైశాచికత్వాన్ని చూపిస్తున్నాడు రవిప్రకాష్
8 కోట్ల మంది ఆంధ్రులను అవమానిస్తూ గలీజ్ ఆంధ్ర అంటూ హెడ్డింగ్ పెట్టాడు. అంటే ఆంధ్రరాష్ట్రం గలీజుదా.. అంత దారుణంగా ఉందా ఆంధ్ర రాష్ట్రం. ఓ వైపు చంద్రబాబు బీహార్ రాష్ట్రం అంటుంటే.. అందుకు వత్తాసుగా గలీజ్ ఆంధ్ర అంటూ రెండు వైపులా దుర్బిద్దిని చాటిచెప్పుకున్నాడు.
గలీజ్ ఆంధ్ర అంటూ అటు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తూ.. ఇటు సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంపైనే కొత్త విష ప్రచారానికి తెరతీశాడు రవిప్రకాష్ అంటున్నారు నెటిజన్లు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత దారుణంగా అవమానించటంపై తెలుగోళ్లు అందరూ భగ్గుమంటున్నారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.