ఫాలొఫాలోమీ.. బీజేపీని బుట్టలో వేసేసిన కేసీఆర్

August 9, 2018

బీజేపీ – మోడీని బుట్టలో వేసేశారా సీఎం కేసీఆర్.. ఎన్నికల్లో బీజేపీ జాతకాన్ని టీఆర్ఎస్ పార్టీ రాయబోతున్నదా.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీతో వ్యూహాత్మక స్నేహహస్తం అందిస్తున్నారు. విధానపరమైన మద్దతుతో తన దారిలోకి తెచ్చుకున్నారు కేసీఆర్. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. అన్నీ చక్కబెట్టేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఏడాది కాలంగా అమిత్ షా మళ్లీ తెలంగాణ టూర్ చేపట్టకపోవటానికి కూడా ఇదే కారణం అంటున్నారు. అమిత్ షా హైదరాబాద్ టూర్ తర్వాత కూడా.. కేంద్ర మంత్రులు బహిరంగంగానే కేసీఆర్ పాలనను కీర్తిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ పాలన, కేసీఆర్ విజన్ అద్భుతంగా కీర్తించారు ప్రధానమంత్రి మోడీ. దీంతో కొద్దోగొప్పో తెలంగాణలో బలపడదాం అనుకున్న బీజేపీ నేతల ఆశలు గల్లంతు అయ్యాయి.

2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకి కేసీఆర్ పరోక్ష వ్యూహం రచించినట్లు. 25 అసెంబ్లీ సీట్లు, ఐదు ఎంపీ సీట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారంట. పొత్తు బహిరంగంగా పెట్టుకోకపోయినా.. ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ బలహీనమైన క్యాడర్ ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మీరు బలమైన క్యాండిడెట్లను పెట్టుకోండి.. అప్పుడు మీ అభ్యర్థులే గెలుస్తారు కదా అన్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారనేది పొలిటికల్ అనలిస్ట్ ల వాదన. సీట్ల సర్దుబాటు విషయంలోనూ బీజేపీని తనదారికి తెచ్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ. ఎంత తొందరగా అంటే అంత తొందరగా.. బీజేపీని తన బుట్టలో వేసుకుని.. బయటకు ఎగిరిపోకుండా చూడాలనేది కేసీఆర్ బలమైన వ్యూహంతో ముందుకెళుతున్నారు.


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.