ప్రెస్టేషన్ లో ఎల్లో మీడియా : సంకనాకిపోతున్నారు

March 23, 2019

దీనెమ్మ జీవితం.. సోషల్ మీడియాను ఎవడ కనిపెట్టోడో కానీ.. వాడిని.. ఎల్లో మీడియా ప్రెస్ట్రేషన్ ఇది. రాసింది నిజం.. చూపింది సత్యం అన్నట్లు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ వెళ్లారు.. కాలంతోపాటు యువత ఆలోచనలు కూడా మారాయి. అయినా సరే మేం ఇదే చెబుతాం అన్నట్లు పచ్చ మీడియా ముసుగులో చెలరేగిపోతున్న వాళ్లను రోజురోజుకు వాతలు పెడుతున్నారు నెటిజన్లు. మన ఇంటి గుమ్మం దగ్గర పేపర్ పడే కంటే ముందే.. సోషల్ మీడియాల ఎల్లో మీడియా రాతలకు.. కౌంటర్లు, పంచ్ లు పేలిపోతున్నాయి. ఉదయం లేచి దేవుడి బొమ్మ కంటే ముందే.. ఎల్లో మీడియా అరాచకాలను చీల్చిచెండాడుతున్నారు.
ఒక్క నెటిజన్లు అనేముందీ.. పార్టీలు సైతం రెచ్చిపోతున్నారు. గతంలో వీళ్లు రాయకపోతే ఎవరు రాస్తారు అనే భయం.. వాళ్లు తలచుకుంటే ఏమైపోతామో అనే గుబులు వెంటాడేది.. ఇప్పుడు అలా కాదు.. డిజిటల్, సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎవరికి వాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పుకునే అవకాశం వచ్చింది. అదే చేస్తున్నారు కూడా. పార్టీ అధినేతలే కాదు చిన్న కార్యకర్త కూడా తన పార్టీ అభిమానాన్ని ఘనంగా చాటుకోవటానికి ఓ వరం డిజిటల్.
చంద్రబాబు – పవన్ కల్యాణ్ లోపాయికారీ ఒప్పందాన్ని, లోగుట్టు మద్దతును చీల్చిచెండాడుతోంది సోషల్ మీడియా. దీన్ని కౌంటర్ చేసుకోలేక తలలు పట్టుకుంటోంది ఎల్లో మీడియా. ఓ సందర్భంగా ఒకే డైలాగ్ కు.. చంద్రబాబు – పవన్ కల్యాణ్ పేర్లు వేశారు అంటే.. ఎంత డైలమాలో ఉన్నారో అర్థం అవుతుంది. ఆంధ్ర – తెలంగాణ మధ్య చిచ్చుపెట్టటానికి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను అంతకు వెయ్యి రెట్లు పంచ్ లతో జనసేన సీన్ సితార చేశారు నెటిజన్లు. తెలంగాణలో ఆంధ్ర వాళ్లను కొడుతున్నారంటూ చేసిన పవన్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో వస్తున్న కౌంటర్లు చూసి.. ఎల్లో మీడియా కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసింది అంటే.. ఏ స్థాయిలో ఆ పత్రికలు – ఛానల్స్ సంకనాకిపోయాయో అర్థం అవుతుంది.
ఎల్లో మీడియా సంకనాకిపోవటానికి చిన్న ఎగ్జాంపుల్ ఇదే. చంద్రబాబు లైవ్ ను ఎల్లో మీడియాలోనే యావరేజ్ లైవ్ వ్యూస్ దారుణంగా పడిపోయాయి. నెటిజన్లు అందరూ కూడా మిగతా య్యూట్యూబ్ ఛానల్స్ లైవ్ ఫాలో అవుతున్నారు. ఇది చాలు వారు సంకనాకిపోయారు అనటానికి. అంతేనా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును జగన్ ఫ్యామిలీపై రుద్దుటానికి చేస్తున్న ప్రయత్నాలు, వారి రాతలు, నాన్ స్టాప్ డ్రైవ్ లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కౌంటర్లు ఇవ్వటం చూస్తుంటే.. ఎల్లోమీడియా ప్రెస్టేషన్ పతనం ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది.
నిజం నిప్పులాంటిది.. అది ఎప్పటికైనా బయటకు రావాల్సిందే.. దాని అగ్నికి బలికావాల్సిందే. ఇప్పుడు తెలుగు మీడియాలో ఇదే జరుగుతుంది. మీడియా ఎవడబ్బ సొత్తు కాదు.. నిజాన్ని ఎవడూ ఆపలేడు అంటోంది సోషల్ మీడియా..


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.