పిల్లలను కాపాడిన హీరోని.. ప్రభుత్వం ఇంత క్రూరంగా హింసిస్తుందా..

August 9, 2018

ఇతని పేరు డాక్టర్ ఖఫీల్ ఖాన్. ఒక్క పేరు చెబితే గుర్తుపట్టటం కష్టం. అదే యూపీ గోరఖ్ పూర్ లోని ఆస్పత్రిలో ఆక్సీజన్ లేక 27 మంది పిల్లలు చేనిపోయిన ఘటన గుర్తుందా అని అంటే.. ఠక్కున వెలుగుతుంది. ఆ ఆస్పత్రిలో ఖఫీల్ ఖాన్ పిల్లల వైద్య నిపుణులు. ఇది జరిగి ఏడాది అవుతోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం అని అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, నిపుణులు తేల్చారు. అప్పుడే అధికారంలోకి వచ్చిన యోగీ సర్కార్ కు ఇది మింగుడు పడలేదు.. ప్రభుత్వంపై మరక పడటం ఇష్టం లేక ఈ నెపాన్ని మరొకరిపైకి నెట్టింది. తనకు సంబంధం లేకపోయిన ఆ నింద పడి.. జీవితాన్ని కోల్పోయిన వ్యక్తే ఈ ఖఫీల్ ఖాన్. న్యాయం అందరి పక్షం ఒకేలా ఉండాలనే కనీస ధర్మానికి విరుద్ధంగా జరిగిన ఈ కుట్రలో బలయ్యాడు ఖఫీల్ ఖాన్. ఆస్పత్రిలో పిల్లల వైద్యులు డాక్టర్ ఖఫీల్ ఖాన్‌పై అప్పుడే వేటు వేసింది యోగీ సర్కార్. జైలుకి పంపింది. 2018 ఏప్రిల్‌లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. అప్పట్లో.. చిన్నారులకు ఆక్సిజన్ అందించి కొందరి ప్రాణాలను నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి దేశం దృష్టిలో డాక్టర్ ఖఫీల్ హీరో అయ్యాడు. ప్రజలు అందరూ కీర్తించారు. ప్రపంచం మొత్తం శభాష్ అంది. యూపీ సర్కార్ మాత్రమే ఆయన్ను దోషిగా నిలబెట్టింది. అంతేకాదు అవినీతి ఆరోపణలు అంటగట్టి, క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అప్పటి నుంచి ఖఫీల్ కుటుంబం ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో ఖఫీల్ తమ్ముడిని కాల్చి చంపారు. ఈ కేసులోనే.. ఖఫీల్ అన్నను అరెస్టు చేశారు. ఈ కేసులకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఇందుకోసం ఖఫీల్ తన ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా డాక్టర్ ఖఫీల్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సొంతంగా ప్రాక్టీస్ కూడా నిర్వహించరాదని ఆదేశించింది.

ప్రభుత్వం ఖఫీల్‌ను పట్టించుకోక పోయినా.. ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలు డాక్టర్ ఖఫీల్ కుటుంబానికి బాసటగా ముందుకొచ్చారు. క్రౌడ్ న్యూసింగ్ డాట్ కామ్ అనే స్వతంత్ర ప్రచార సంస్థ ఖఫీల్ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు రూ.6లక్షలు రూపాయలు విరాళంగా సేకరించింది. రూ. 20లక్షలు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు క్రాడ్ న్యూసింగ్ సంస్థ తెలిపింది. ఒక్క ఏడాదిలోనే ఈ డాక్టర్ ఉన్నదంతా పోగొట్టుకున్నాడు అనే పేరుతో సంస్థ విరాళాలను సేకరిస్తోంది.
ఒక మనిషిపై నిందలు మోపి కష్టపెట్టడం సరికాదు. సామాన్య పౌరులు తిరగబడాలి లేదా డాక్టర్ ఖలీఫ్‌ ఎలాగైతే మానసిక హింసకు గురవుతున్నాడో అలా బతికేందుకు సిద్ధపడాలి. భారత పౌరులుగా ఇలాంటి వ్యక్తులను ఆదుకునేందుకు ముందుకు రావాలి”అని తమ క్యాంపెయిన్ పేజ్ మీద రాసుకుంది న్యూసింగ్ డాట్ కామ్. అంతేకాదు సేకరించిన విరాళాలు ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలిపింది. డాక్టర్ ఖఫీల్ ఖాన్‌కు ఉన్న అప్పులు తీర్చేందుకు, న్యాయపరమైన పోరుకు అవసరమయ్యే ఖర్చుకు, వైద్యానికి, డాక్టర్ ఖఫీల్‌కు ప్రభుత్వం చేసిన అన్యాయం గురించి దేశవ్యాప్తంగా పర్యటించి చెప్పేందుకు ఈ డబ్బులు ఖర్చు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే విరాళాలు బాగా వస్తే చిన్నారుల కోసం 20 పడకల ఆస్పత్రిని నిర్మించాలని డాక్టర్ ఖఫీల్ ఖాన్ భావిస్తున్నారు. మనం కూడా ఖఫీల్ ఖాన్‌కు ఆల్ దిబెస్ట్ చెప్పేద్దాం…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.