నగిరిలో రోజా, చీరాలలో బలరాం ఓడిపోవాలి : సొంత పార్టీ వాళ్లే పూజలు

April 20, 2019


మా పార్టీ వాళ్లే గెలవాలి అని కోరకుంటారు ఎవరైనా.. అమ్మో మా పార్టీ అయినా సరే వాళ్లు మాత్రం గెలవకూడదు అని కోరుకుంటున్నారు ఆయా పార్టీల అభిమానులు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగిన కరణం బలరాం గెలవకూడదని టీడీపీ అభిమానులు కోరుకుంటుంటే.. చిత్తూరు జిల్లా నగిరి నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగిన రోజా కూడా ఓడిపోవాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రెండు పార్టీల్లోని కార్యకర్తలు, అభిమానులు చాలా చాలా బలంగా ఇదే కోరుకుంటున్నారు. బెట్టింగ్ రాయుళ్లు అయితే వీళ్లిద్దరి గెలుపు-ఓటముల అంచనా ఆధారం పందేలు కూడా కాస్తున్నారు.
దీనికి కారణం వారి లెగ్ మహిమలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బలరాం ఓడిపోతూ వస్తున్నారు.. ఆయన గెలిచినప్పుడు పార్టీ ఓడిపోతుంది. రోజాది కూడా సేమ్ సిట్యువేషన్ అంటున్నారు. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదనే ప్రచారం ఉంది. ఈసారి ఎన్నికలు పార్టీలకు చావో బతుకో అన్నట్లు సాగాయి. దీంతో సెంటిమెంట్ పైనా కార్యకర్తలు, అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. రోజా ఓడిపోవాలని వైసీపీ వాళ్లు, బలరాం ఓడిపోతేనే పార్టీ గెలుస్తుందని టీడీపీ వాళ్లు బలంగా కోరుకుంటున్నారు.
అమ్మో వాళ్లిద్దరికీ ఐరన్ లెగ్. వాళ్లు గెలిచారా ఇక పార్టీ మటాష్ అంటున్నారు పందెం రాయుళ్లు. ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా పందేలు ఎక్కువగా కాస్తున్నా.. రోజా మాట ఎత్తితే చాలు.. అమ్మో ఆమె గెలుస్తుందా అనే ఓ డౌట్ ను.. అవాక్కయ్యే విధంగా మాట్లాడటం విశేషం. ఇక కరణం బలరాం విషయంలో అయితే పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి ఆయనకు అనుకూలంగా మారిపోయింది.. చీరాలలో టీడీపీ గెలవటం ఖాయం అంటున్నారు. దీంతో టీడీపీ అభిమానులు, కార్యకర్తల్లో ఓ నిరుత్సాహం వ్యక్తం అవుతుంది. బలరాం గెలిస్తే.. టీడీపీ అధికారంలోకి రావటం కష్టం అంటున్నారు. ఇక రోజా గెలుపుపై అనుమానాలు వ్యక్తం అవుతుంటే మాత్రం.. వైసీపీ శ్రేణులే లోలోపల ముసిముసిగా ఖుషీ అవుతున్నారు. రోజా ఓడిపోతే ఏంటీ.. జగన్ సీఎం అవుతారు కదా అంటున్నారు.
మొత్తానికి టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లోని ఈ ఐరన్ లెగ్స్ గెలుపుపైనే ఆ పార్టీల విజయం ఆధారపడి ఉందంటూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది ఏపీ రాష్ట్రంలో…


ట్రెండింగ్ ఆర్టికల్స్

Sorry. No data so far.